Breaking News

యూరియా ‘బస్తా’మే సవాల్‌!

Published on Sun, 08/31/2025 - 04:49

ఆళ్లగడ్డ/కోరుకొండ: రాష్ట్రంలో యూరియా అందక రైతులు నానా అవస్థలు పడుతున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో యూరియా పంపిణీలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకుడి (వీఏఏ)పై టీడీపీ శ్రేణులు దాడి చేసిన ఘటన శనివారం నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం కొండాపురంలో చోటు చేసుకుంది. గ్రామ సచివాలయం వద్ద యూరియా పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న రైతులు అక్కడికి చేరుకున్నారు. ఒక్కొక్కరికి (ఒక్కో పాసు పుస్తకానికి) రెండు బస్తాల చొప్పున వీఏఏ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి రసీదు రాసిస్తున్నారు.

ఈ క్రమంలో గ్రామానికి చెందిన కొందరు టీడీపీ వారు సచివాలయం వద్దకు చేరుకుని ‘ఒక్కో రైతుకు రెండు బస్తాల ఇస్తున్నామన్నారు కదా. ఇందులో ఓ రైతుకు 10 బస్తాలు ఎలా రాసిచ్చావ్‌’ అంటూ వాగ్వాదానికి ది­గారు. అతను ఐదు పాసు పుస్తకాలు తెచ్చుకుని ఒకే రసీదు రాయించుకున్నారని, పైగా అతను కూడా టీడీపీకి చెందిన వారేనని వీఏఏ తెలిపారు. దీంతో వారు గట్టిగా కేకలు వేస్తూ వీఏఏపై దాడి చేసి బయటకు ఈడ్చుకొచ్చి పిడిగుద్దులు కురిపించారు. విషయం తెలుసుకున్న మండల వీఏఏలు అక్కడకు చేరుకుని ఇలా అయితే యూరియా పంపిణీ చేసేది లేదని నిరసన వ్యక్తం చేశారు.

అంతలో వీఏఏ బంధువులు కూడా అక్కడకు చేరుకోవడంతో సమస్య మరింత జటిలమైంది. ఎస్‌ఐ రామిరెడ్డి, తహసీల్దార్‌ సుభద్ర, ఎంపీడీవో సావిత్రి, ఏవో ప్రమీల అక్కడకు చేరుకుని రెండు వర్గాలకు సర్దిచెప్పడంతో సమస్య సర్దుమణిగింది. కాగా దాడి చేసిన వారిపై కేసు నమోదు చేయాలని వీఏఏల సంఘం డిమాండ్‌ చేస్తోంది. 

ఇదిలా ఉండగా..  
కోరుకొండలోని వ్యవసాయ సహకార పరపతి సంఘం వద్ద శనివారం జరిగిన యూరియా బస్తాల పంపిణీ రైతుల మధ్య ఘర్షణకు దారితీసింది. కోరుకొండ సొసైటీకి యూరియా ఎరువులు వచ్చాయని తెలుసుకున్న ఆ సొసైటీ పరిధిలోని 10 గ్రామాల రైతులు  భారీ సంఖ్యలో తరలి రావడంతో తోపులాట జరిగింది. రైతులు ఘర్షణ పడ్డారు. నలుగురు రైతులకు స్వల్పంగా గాయాలవగా, సొసైటీ తలుపులు, కిటికీలు, అద్దాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ విషయమై సీఈఓ వర్మను వివరణ కోరగా.. వాస్తవానికి 180 టన్నుల యూరియా అవసరం కాగా, 80 టన్నులే వచి్చందని పేర్కొన్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)