Breaking News

అమరావతి ఓఆర్‌ఆర్‌ 500 మీటర్ల వెడల్పా!?

Published on Wed, 07/22/2026 - 04:52

సాక్షి, అమరావతి/కృష్ణలంక (విజయవాడ తూర్పు): అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్‌ 140 మీటర్ల నుంచి 500 మీటర్ల వరకు వెడల్పుతో నిర్మించేందుకు వీలుగా భూసేకరణ చేయడం పట్ల ఐదు జిల్లాల అమరావతి రింగ్‌రోడ్డు బాధిత రైతుల సమావేశం ఆందోళన వ్యక్తం చేసింది. సాధారణ వెడల్పు 140 మీటర్లు, కూడళ్ల వద్ద 250 నుంచి 500 మీటర్ల మేర రోడ్డు నిరి్మంచాలని ప్రతిపాదించడం అర్ధరహితమని పేర్కొంది. దేశవ్యాప్తంగా జాతీ­య రహదారుల వెడల్పు 70 మీటర్లకు మించి లే­దని గుర్తుచేసింది. ఏపీ రైతుసంఘం రాష్ట్ర నాయకుడు పి.వి ఆంజనేయులు అధ్యక్షతన విజయవాడలో మంగళవారం ఈ సమావేశం జరిగింది. 

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సర్వీస్‌ రోడ్లకు గోడలు, ఇనుప కంచెలు వేస్తే రోడ్డు వెంబడి సరిహద్దు పొలాలకు ఏ మాత్రం విలువ పెరగదని చెప్పారు. రింగ్‌రోడ్డు పోయే గ్రామాల ప్రజలను సంప్రదించకపోవడం దారుణమన్నారు. వెంటనే గ్రామసభలు పెట్టి ఈ ప్రాజెక్టుపై వాస్తవాలను రైతులకు వివరించాలని డిమాండ్‌ చేశారు. పారదర్శకత లేని అప్రజాస్వామిక పద్ధతులను ప్రభుత్వం, అధికారులు విడనాడాలని కోరారు. ఐదుజిల్లాల్లోంచి వెళుతున్న అమరావతి ఔటర్‌ రింగ్‌రోడ్డుకు ఆ జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్‌ జారీచేసి ఆరునెలలవుతోందన్నారు.

రైతులకు వ్యక్తిగతంగా ఎంత పొలం పోతుంది? ప్రభుత్వం ఎంత చెల్లిస్తుందనే దానిపై ఒక్క రైతుకు కూడా నోటీసు రాలేదని, ఒక్కచోట కూడా గ్రామసభ నిర్వహించలేదని చెప్పారు. డీపీఆర్‌ గురించి సీఆర్‌డీఏ అధికారులను, కలెక్టర్లను, రెవెన్యూ మంత్రిని ఎవరినడిగినా సమాధానం లేదన్నారు. ఈ ప్రాజెక్టు విషయాన్ని అంత సీక్రెట్‌గా ఉంచాల్సిన అవసరం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన సామాజిక అధ్యయనం రిపోర్టుగానీ, డీపీఆర్‌గానీ రైతులకు అందుబాటులో ఉంచాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తక్షణం గ్రామసభలు పెట్టి రైతులకు వాస్తవాలు చెప్పి వారి అనుమానాలను తీర్చకపోతే బాధిత రైతుల తరఫున ఆందోళన చేస్తామని వారు హెచ్చరించారు. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)