Breaking News

ధాన్యం కొనాలంటూ రైతుల ఆందోళన

Published on Tue, 05/13/2025 - 06:08

తాళ్లపూడి (కొవ్వూరు): ‘ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనడంలేదు. మిల్లర్ల వద్దకు తీసుకువెళితే టార్గెట్‌ పూర్తయిందని చెప్పి తీసుకోవడం లేదు. మరి మేం పండించిన ధాన్యాన్ని ఏం చేయాలి..’ అంటూ తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గ రైతులు ప్రశి్నస్తున్నారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయడాన్ని నిరసిస్తూ కొవ్వూరు సమీపంలోని గామన్‌ బ్రిడ్జి వద్ద జాతీయ రహదారిపై ధాన్యం లోడు ట్రాక్టర్లను నిలిపి ఆందోళన చేశారు. కొవ్వూరు, తాళ్లపూడి మండ­లాల రైతులు మండుటెండలో రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని, తమ వద్ద ఉన్న రబీ ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని నినాదా­లు చేశారు.

ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తమ వద్ద ధాన్యం కొనలేని స్థితిలో ప్రభుత్వం ఉందా.. అని మండిపడ్డారు. నియో­­జకవర్గంలో ఇంకా 5వేల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేయాల్సి ఉందని చెప్పారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆందోళనకు దిగా­మని తెలిపారు. పౌర సరఫరాల సంస్థ చైర్మన్‌ తోట సు«దీర్, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.చిన్నరాముడు, కొవ్వూరు ఆర్‌డీవో రాణి సుస్మిత, పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ టి.రాధిక వచ్చి 5 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని హామీ ఇవ్వ­డంతో రైతులు ఆందోళన విరమించారు. రైతుల ఆందోళనతో హైవేపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)