Breaking News

వరమివ్వని ఉద్యానం

Published on Thu, 04/03/2025 - 06:03

‘గ్రోత్‌ ఇంజిన్లు’గా చెప్పుకునే అరటి, చీనీ, టమాట, మిర్చి, మామిడి ఈ ఏడాది ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. లక్షలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటలు కన్నీళ్లే మిగిల్చాయి. పంట పండితే ధరలు లేవు, ధరలుంటే పంటలు పండవు అన్నట్లుగా పరిస్థితి తయారైంది. గతంలో ఎన్నడూ లేనంతగా అరటి, మిర్చి, టమాట రైతులు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉద్యాన రైతులకు ఎక్కడా ఊరట లభించడం లేదు. అరటి రైతులైతే ఈ ఏడాది దారుణంగా దెబ్బతిన్నారు.పెట్టుబడులు పెరగడం, ధర తగ్గడంతో నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఒక దశలో రూ. 25 వేలు పలికిన టన్ను అరటి.. నేడు రూ.11 వేలు కూడా లేదు. రైతులేమో ఎకరాకు రూ. లక్షన్నర వరకూ పెట్టుబడి పెట్టారు. చాలా చోట్ల దిగుబడి బాగా వచ్చినా ధరల్లేక నిరాశే మిగులుతోంది. వాస్తవానికి జిల్లాలో పండే ‘గ్రాండ్‌ నైన్‌ అరటి’కి అంతర్జాతీయ మార్కెట్‌లో మంచి ధర లభిస్తున్నా ఎగుమతి సౌకర్యం లేకపోతోంది.   

మిరప, టమాట రైతుల కన్నీళ్లు 
మిరప, టమాట రైతులను కదిలిస్తే కన్నీటి గాథ బయటికొస్తోంది. మార్కెట్‌లో ప్రస్తుతం పచ్చి మిర్చి కేజీ రూ.20 లేదా రూ.30 కంటే ఎక్కువ లేదు. కేజీ కనీసం రూ.40 పలికితేనే రైతుకు గిట్టుబాటవుతుంది. రిటైల్‌ మార్కెట్‌లోనే రూ.20 ఉంటే రైతు పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక టమాట రైతులకు అప్పులే మిగులుతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా కిలో టమాట రూ.10 కంటే ఎక్కువ పలకడం లేదు. ఎరువులు, పురుగుమందు ఖర్చులు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. 

చీనీ రైతులకూ చేదు గుళికలే.. 
రాష్ట్రంలోనే అత్యధికంగా చీనీ దిగుబడి జిల్లాలో   ఉంటుంది. చీనీ టన్ను ఇటీవల కాలంలో రూ.20 వేలు మించి పలకడం లేదు. 2021 కరోనా       అనంతరం టన్ను లక్ష రూపాయలు అమ్మిన       సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటిది నేడు రూ.20 వేలు ఉందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అంచనా వేయొచ్చు. మరోవైపు.. మామిడి ప్రస్తుతానికి పూత, పిందె వస్తున్నా.. వచ్చే రోజుల్లో నిలబడగలదా అన్న భయం రైతుల్లో నెలకొంది.

ప్రభుత్వమే ఆదుకోవాలి 
రెండు ఎకరాల్లో టమాట పంటను సాగు చేశా. సుమారు రూ. లక్ష పెట్టు బడి పెట్టా. «గిట్టుబాటు ధర లేకపోవటంతో పంటను తోటలోనే వదిలేశా. టమాట పంటకు మద్దతు ధర ప్రకటించి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.– బసవరాజు, దొడగట్ట, కళ్యాణదుర్గం

మార్కెటింగ్‌ సౌకర్యం లేదు
2 ఎకరాల్లో అరటి  సాగు చేశా. ఎకరాకు రూ. లక్ష చొప్పున రెండు లక్షల వరకూ  పెట్టుబడి పెట్టా. పంట ఉత్పత్తుల ఎగుమతు­లకు సరైన సౌకర్యం లేకపోవడంతో గిట్టుబాటు కావడం లేదు. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుని మార్కెటింగ్‌ సౌకర్యం కల్పిస్తే బాగుంటుంది. – నాగరాజు, పెద్దజలాలపురం గ్రామం,  శింగనమల, మండలం

Videos

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)