Breaking News

టీడీపీ నేత దౌర్జన్యం నుంచి రక్షించండి

Published on Tue, 08/05/2025 - 05:36

చిత్తూరు కలెక్టరేట్‌ : టీడీపీ నేత నుంచి రక్షణ కల్పించాలని చిత్తూరు జిల్లా వి.కోట మండలం నడమంత్రం గ్రామానికి చెందిన రైతు చౌడప్ప సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ ఎదుటే పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. ఈ హఠాత్పరిణామానికి అధికారులు, సిబ్బంది హతాశులయ్యారు. వెంటనే అక్కడే ఉన్న వైద్య సిబ్బంది రైతుకు ప్రథమ చికిత్స చేశారు. అనంతరం  108 వాహనంలో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనతో బాధితుడి భార్య శ్యామలమ్మ కన్నీరుమున్నీరయ్యారు. తమ గోడును విలేకరుల ఎదుట వెళ్లబోసుకున్నారు.

ఆమె కథనం ప్రకారం.. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం వి.కోట మండలం నడమంత్రం గ్రామానికి చెందిన చౌడప్ప పేరుతో ఉన్న భూమిని రాసివ్వాలంటూ టీడీపీ నేత కృష్ణమూర్తిగౌడ్‌ అధికారబలంతో దౌర్జన్యానికి పాల్పడుతున్నాడు. ఇప్పటికే రైతును ఏమార్చి రెండెకరాలు రాయించుకున్నాడు. చౌడప్పకు రెండెకరాల డీకేటీ భూమి ఉండగా అందులో కొంత పక్కవాళ్లకు చెందుతుంది. దీనిని సర్వే చేసి తమకు ఇవ్వాలని ఆన్‌లైన్‌లో చౌడప్ప నగదు చెల్లించారు. అయితే టీడీపీ నేత అధికారబలంతో సర్వే సిబ్బందిని రానివ్వకుండా అడ్డుకుంటున్నాడు.

న్యాయం చేయాలని తహసీల్దార్, కలెక్టరేట్‌లో జరిగే ప్రజాసమస్యల పరిష్కార వేదికకు పదిసార్లు వచి్చనా అధికారులు పట్టించుకోలేదు. చివరిసారిగా సోమవారం మరోమారు అర్జీ ఇద్దామని భార్యతో కలిసి చౌడప్ప వచ్చాడు. అయినా అధికారుల నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చౌడప్ప కలెక్టర్‌ ఎదుటే బ్యాగులో తెచ్చుకున్న పురుగుమందు డబ్బా తీసుకుని తాగేశాడు. ప్రస్తుతం చౌడప్ప చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)