ప్రభుత్వ ఒత్తిళ్ల వల్లే మా నాన్న మరణించారు

Published on Tue, 07/14/2026 - 05:05

తాడేపల్లి రూరల్‌: ‘ప్రభుత్వం ఒత్తిళ్లకు గురి చేయడం వల్లే మా నాన్న మృతి చెందారు’ అని గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామానికి చెందిన రైతు గుంటక పద్మనాభరెడ్డి కుమారుడు ఉజ్వల్‌ చెప్పారు. బతుకుదెరువు నిమిత్తం ఆస్ట్రేలియాలో ఉంటున్న ఉజ్వల్‌ తండ్రి పద్మనాభరెడ్డి అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరారనే సమాచారం తెలిసిన వెంటనే అక్కడి నుంచి బయలుదేరి సోమవారం నేరుగా విజయవాడ­లోని ఆస్పత్రికి చేరుకు­న్నారు. అప్పటికే తండ్రి మరణించడంతో భోరున విలపించారు.

ఉజ్వల్‌ను ‘సాక్షి’ పలకరించగా.. ‘రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా భూసమీకరణలో మా పొలం తీసుకుంటున్నట్టు నోటిఫికేషన్‌ ఇచ్చింది. అప్పటినుంచి మా నాన్న తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఉండవల్లిలో ఏం జరుగుతోందో ప్రతిరోజూ నాతో చెబుతున్నారు. సీఆర్‌డీఏ అధికారులు రెండ్రోజుల క్రితం కొందరి భూములను బలవంతంగా లాక్కున్న విషయం నాతో చెప్పి తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. 1951 నుంచి పండించుకుంటున్న పంట పొలాల్ని ప్రభుత్వం లాక్కుంటుంటే ఎవరైనా ఒత్తిడికి గురవుతారు. నా తండ్రిలాగా ఉండవల్లిలో ఎంతోమంది రైతులు ఉన్నారు.

ఇన్నిరకాల పంటలు పండే సారవంతమైన భూములు తీసుకోకుండా ప్రభుత్వం రైతుల ప్రాణాలు కాపాడాలని కోరుకుంటున్నాను. ఐదేళ్ల క్రితం నా తల్లి చనిపోయింది. అప్పటి నుంచి మా నాన్న పొలం చూసుకుంటూ ఇక్కడే ఉంటున్నారు. డయాలసిస్‌ పేషెంట్‌ అయినప్పటికీ మా నాన్న ఆరోగ్యం బాగానే ఉంది. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలుసు. భూములు లాక్కున్న నాటినుంచి ఒత్తిడికి గురై ఆస్పత్రిలో చేరి గుండెపోటుతో నాన్న మృతి చెందారు. నా తండ్రిలా ఏ రైతూ ఇబ్బంది పడకూడదు. ఆయన పరిస్థితి ఏ రైతుకూ రాకూడదు’ అని ప్రార్థించారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)