టీడీపీ నాయకుల భూ ఆక్రమణతో రైతు ఆత్మహత్య

Published on Fri, 04/04/2025 - 04:39

కలికిరి(వాల్మికిపురం): భారత సైన్యంలో పనిచేసినందుకు తన తండ్రికి ప్రభుత్వం ఇచ్చిన భూమిని టీడీపీ నాయకులు ఆక్రమించడం.. అధికారులు కూడా వారికే వత్తాసు పలకడంతో మనస్తాపం చెందిన ఓ రైతు ఉరేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఈ దారుణ ఘటన గురువారం అన్నమయ్య జిల్లా వాల్మికిపురం మండలంలో చోటు చేసుకుంది. అన్నమయ్య జిల్లా వాల్మికిపురం మండలం మూరేవాండ్లపల్లికి చెందిన రామయ్య భారత సైన్యంలో ఉద్యోగం చేశారు.

ఆయన రిటైర్‌మెంట్‌ అనంతరం ప్రభుత్వం జీవనాధారం కోసం 1975వ సంవత్సరంలో అదే మండలంలోని తాటిగుంటపల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.1051లో 5.53 ఎకరాల విస్తీర్ణానికి పట్టా మంజూరు చేసింది. రామయ్య మరణానంతరం అతని కుమారుడు రైతు వెంకటా­ద్రి తన పేరుపై భూమిని ఆన్‌లైన్‌ చేయాలని రెవె­న్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. అ­యినా వారు పట్టించుకోలేదు. ఆ భూమిపై కన్నేసిన మూరేవాండ్లపల్లికి చెందిన మోహన్‌రెడ్డి, పెద్దవంకపల్లికి చెందిన శ్రీనివాసులురెడ్డి, టీడీపీ నాయకుడు నారాయణరెడ్డి.. ఇటీవల దానిని ఆక్రమించుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న వెంకటాద్రి ప్ర­జా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. రెవెన్యూ అధికారులు ఆక్రమణదారులకే వత్తాసు పలకడంతో పాటు ఆ భూమితో సంబంధం లేదంటూ వెంకటాద్రితో సంతకాలు చేయించుకున్నారు. దీంతో మనస్తాపానికి గురైన వెంకటాద్రి గురువారం తెల్లవారుజామున తన ఇంటి పక్కనున్న చెట్టుకు ఉరి వేసుకున్నాడు. 

తన చావుకు నా­రా­యణరెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీనివాసు­లురెడ్డి, తహశీల్దారు పమిలేటి కారణమని సూసైడ్‌ నోట్‌లో పే­ర్కొన్నాడు. అదే విషయాన్ని చేతిపైనా రాసుకు­న్నాడు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. త­న ఆత్మహత్య తర్వాతైనా.. ఆ భూమిని తన కుమా­రుడు, కుమార్తె పేరి­ట ఆన్‌లైన్‌ చేయాలని విజ్ఞప్తి చేశాడు. కాగా, వెంకటాద్రి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)