Breaking News

‘అలాంటి ధైర్యంపైనే కొడతామంటే చూస్తూ ఊరుకునేది లేదు’

Published on Tue, 07/14/2026 - 16:01

సాక్షి, గుంటూరు: తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు భూములు వదులుకునే ప్రసక్తే లేదని రైతు గుంటక అనంత పద్మనాభరెడ్డి కుమారుడు ఉజ్వల్‌రెడ్డి అన్నారు. ఉండవల్లికి చెందిన రైతు అనంత పద్మనాభరెడ్డి.. రాజధాని పేరుతో వేధింపులకు గురై గుండెపోటుతో చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన కుమారుడు ఉజ్వల్‌ మాట్లాడుతూ.. 1951 నుంచి తమ కుటుంబానికి పొలం ఉందని.. మాకున్న భూమే మా ధైర్యం.. భరోసా.. అలాంటి ధైర్యంపైన కొడతామంటే చూస్తూ ఊరుకోమని ఆయన స్పష్టం చేశారు.

‘‘భూమిని కాపాడుకోవడానికి మా నాన్న గుంటూరు కలెక్టరేట్‌కు వెళ్ళారు. డయాలసిప్‌ చేయించుకోవడానికి కూడా వెళ్లలేదు. బలవంతపు సేకరణకు భూమి ఇవ్వనని అభ్యంతరాలు దాఖలు చేశారు. వారసత్వంగా వస్తున్న భూమిని ఎలా వదులుకుంటాం?. మా భూమిని ఇవ్వబోమని ఇప్పటికే ప్రభుత్వానికి తేల్చి చెప్పాం. మావి మూడు పంటలు పండే భూములు. బలవంతపు భూసేకరణ సరైంది కాదు. బలవంతంగా భూములు తీసుకుంటే మా సమాధానం కూడా అలానే ఉంటుంది’’ అని ఉజ్వల్‌రెడ్డి పేర్కొన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)