Breaking News

కృష్ణమ్మ రాకతో చెరువుల్లో జలకళ 

Published on Wed, 02/28/2024 - 05:33

శాంతిపురం: కుప్పం కాలువలోకి వచ్చిన కృష్ణా జలాలతో మండలంలోని వెంకటేష్‌పురం వద్ద ఉన్న శెట్టికుంట చెరువు నిండింది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మిట్టపల్లి సమీపంలోని మద్దికుంట చెరువుకు నీరు వదలటంతో అది నిండుతోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం రామకుప్పం మండలంలోని రాజుపేట నుంచి కుప్పం నియోజకవర్గానికి లాంఛనంగా నీటిని విడుదల చేశారు.

అప్పటికే అధికారుల ట్రయల్‌ రన్‌తో కాలువ కింది భాగంలోనూ నీరు ఉండటంతో అదే రోజు సాయంత్రానికి రామకుప్పం మండలం దాటి శాంతిపురం మండలంలో కృష్ణా జలాలు ప్రవేశించాయి. గుండిశెట్టిపల్లి వద్ద పలమనేరు జాతీయ రహదారిపై ఉన్న వంతెన వద్ద నీరు ముందుకు సాగటంతో స్థానిక రైతులు రాత్రి పూట సైతం గంగ పూజలు చేశారు.

అదే క్రమంలో వెంకటేష్ పురం వద్ద ఉన్న చెరువుకు ఉన్న ఓటీ పాయింట్‌ తెరిచి ఉండటంతో మంగళవారం మధ్యాహ్నంలోగా ఈ చెరువు పూర్తిగా నిండిపోయింది. మిట్టపల్లి వద్ద గల మద్దికుంట చెరువుకు మంగళవారం అధికారులు నీరు విడుదల చేయటంతో చెరువు క్రమంగా నిండుతోంది. జలకళతో కనువిందు చేస్తున్న ఈ రెండు చెరువులను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల రైతులు తరలివస్తున్నారు.  

కృష్ణా జలాలపై తప్పుడు రాజకీయం తగదు 
హంద్రీనీవా కుప్పం కెనాల్‌లో నీటి ప్రవాహంపై తప్పుడు రాజకీయం చేయడం తగదని రాష్ట్ర జల వనరుల శాఖ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా రామకుప్పం మండలం రాజుపేట వద్ద బ్రాంచి కెనాల్‌ నుంచి కుప్పం నియోజకవర్గానికి నీటిని విడుదల చేసినట్టు తెలిపింది. క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి కృష్ణా జలాలను వదిలి 70.10 కిలోమీటర్‌ వద్ద తూము గుండా మద్దికుంట చెరువుకు నీటిని తరలించినట్టు వెల్లడించింది. శాంతిపురం మండలంలో 75.75 కిలోమీటర్ల వద్ద గల వెంకటేష్‌పురం శెట్టివానికుంట చెరువును పూర్తిగా నీటితో నింపినట్టు తెలిపింది.

గుండిశెట్టిపల్లి వద్ద గంగ పూజలు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, నేతల నుంచి వచ్చిన విజ్ఞప్తితో కాలువలోని 84వ కిలోమీటరు వరకూ నీటిని విడుదల చేసినట్టు వెల్లడించింది. పూజల అనంతరం నీటిని పూర్తిగా మద్దికుంట చెరువుకు మళ్లించి, అది నిండిన తర్వాత నాగసముద్రం, మణీంద్రం చెరువుకు నీటిని పంపే ఏర్పాట్లలో జలవనరుల శాఖ అధికారులు ఉన్నారని తెలిపింది. కానీ.. కొందరు రాజకీయ దురుద్దేశంతో కృష్ణా జలాలు ఆగిపోయాయని తప్పుడు ప్రచారం చేస్తున్నట్టు పేర్కొన్నారు.

కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువై శ్రీశైలంలో కనీస నీటి నిల్వ ఉన్నప్పటికీ అక్కడి నుంచి 27 చోట్ల ఎత్తిపోతల ద్వారా 733 మీటర్ల ఎత్తులో.. 676 కిలోమీటర్ల దూరంలోని కుప్పం ప్రాంతానికి ప్రభుత్వం నీటిని ఇస్తోందన్నారు. భగీరథ ప్రయత్నంతో అధికారులను పరుగులు పెట్టించిన ముఖ్యమంత్రిని ప్రశంసించాల్సింది పోయి, రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం సరికాదని జల వనరుల శాఖ పేర్కొంది. 

మాట ప్రకారం నీళ్లిచ్చారు  
ఏడాది క్రితం కుప్పానికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కృష్ణా నది నీటిని కాలువలోకి విడుదల చేశారు. దీంతో మా ఊరి చెరువు కూడా పూర్తిగా నిండింది. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉన్నాడు. ఆయన తలచుకుంటే ఎప్పుడో మాకు నీటి కష్టాలు లేకుండా చేసేవాడు. కానీ ఆయన ఎప్పుడూ మమ్మల్ని ఓట్లేసే బానిసలుగానే చూశాడు.  – మంజునాథ్, రైతు, వెంకటేష్ పురం  

నీళ్లు రాలేదంటే కళ్లుపోతాయి 
మా ఊరి దగ్గర హంద్రీనీవా కాలువలో సోమవారం నుంచి నీళ్లు పారుతున్నాయి. నీళ్లు వస్తున్నా రాలేదని గంగమ్మ తల్లితో రాజకీయాలు చేస్తే కళ్లుపోతాయి. ఈ ప్రభుత్వం కుప్పానికి నీరు రావటానికి కాలువను సిద్ధం చేసింది. రేపు కృష్ణా నదిలో నీళ్లు వస్తే మా ప్రాంతంలో ఉన్న అన్ని చెరువులకు నీళ్లు వస్తాయి.   – జయరామిరెడ్డి, రైతు, దండికుప్పం 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)