Breaking News

వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులు

Published on Fri, 02/14/2025 - 05:18

ఏలూరు టౌన్‌: ఏలూరు జిల్లా దెందులూరు నియోజ­కవర్గంలో కూటమి సర్కారు వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులకు తెగబడింది. బుధవారం రాత్రి పెదపాడు మండలం వట్లూరులోని పద్మావతి గార్డెన్స్‌­లో వివాహ వేడుకకు హాజరైన టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ ఉద్దేశపూర్వకంగానే రచ్చ చేసి, వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపైన, వైఎస్సార్‌సీపీ నేతలపైన దౌర్జ­న్యానికి పాల్పడ్డారు. 

గురువారం తెల్లారేసరికి మొత్తం కథ మార్చేశారు. తన డ్రైవర్‌ మానుకొండ సుధీర్‌తో  ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో అబ్బయ్య చౌదరి, దెందులూరు నియోజకవర్గానికి చెందిన మరికొందరు వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు ఫిర్యాదు చేయించారు. వారు తనను దుర్భాషలా­డుతూ కులం పేరుతో దూషించారని సుధీర్‌ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ ఫిర్యాదు మేరకు పోలీ­సు­లు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ పెనుమాల విజయబాబు, మట్టా ప్రవీణ్, జానంపేట బాబు, జితేంద్ర, సాయిరామ్‌ చౌదరి, మరో 20 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.

వివాహ వేడుకలో ఇదేం పని?
నోరు విప్పితే బూతులు మాట్లాడే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని వివాహ వేడుకలో కావాలనే గొడవకు దిగినట్టు వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు. అందరూ సంతోషంతో జరుపుకొనే వివాహ వేడుకలోనూ రాజకీయ రచ్చకు దిగడం, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో గొడవ పెట్టుకోవటంపై టీడీపీ నేతలు సహా అందరూ తప్పుపడుతున్నారు. ఎమ్మెల్యే చింతమనేని కారు వెళ్లేందుకు దారి ఉన్నప్పటికీ, ఏదోలా రగడ సృష్టించాలనే ఉద్దేశంతోనే మాజీ ఎమ్మెల్యే కారు డ్రైవర్‌పై బూతులతో రెచ్చిపోయారని అంటున్నారు.

షూ వేసుకునే స్టిక్‌తో దాడి?
ఎమ్మెల్యే చింతమనేని బూట్లు వేసుకునేందుకు రెండు అడుగులు ఉండే ఐరన్‌ స్టిక్‌ను వినియోగిస్తారని తెలుస్తోంది. దానికి చివరగా పదునైన వంపు ఉంటుందని, దానితో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని బాధితులు చెబుతున్నారు. ఆయన బూతులు తిడుతుండగా వీడియో తీస్తున్న హేమంత్‌ నుంచి సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. 

అబ్బయ్య చౌదరి డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతుండగా వారించిన వైఎస్సార్‌సీపీ పెదవేగి మండల అధ్యక్షుడు జానంపేట బాబు, దెందులూరు వైస్‌ ఎంపీపీ వేమూరి జితేంద్ర, మండల నాయకులు ఎం.కృష్ణారావుపై దాడి చేశారు. జానంపేట బాబుకు రెండు చేతులపై గాయాలయ్యాయి. వీడియో తీస్తున్న వారిపై చింతమనేని అనుచరులు దాడి చేసి సెల్‌ఫోన్లు లాక్కున్నట్లు చెబుతున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)