Breaking News

అభూతకల్పనతో ఈనాడు ఒప్పందం

Published on Fri, 08/11/2023 - 04:49

సాక్షి, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇచ్చిన ప్రకటనతో ఈనాడుకు గొంతులో వెలక్కాయ పడ్డట్టు అయింది. వర్సిటీల్లో బోధన పోస్టుల నియామకాల అంశం కోర్టులో ఉన్నంత కాలం ఒక్క పోస్టు కూడా ప్రభుత్వం భర్తీ చేయట్లేదని మొసలి కన్నీరు కార్చిన రామోజీ.. ఇప్పుడు ఒప్పంద ఉద్యోగులకు భద్రత లేదంటూ కొత్త పల్లవి అందుకున్నారు. అభూత­కల్పనలు, అవాస్తవాలతో ఒప్పందం చేసుకుని విష­పూరిత రాతలతో ప్రభుత్వంపై బురద జల్లుతు­న్నా­రు. ఇందులో భాగంగానే ‘ఒప్పంద అధ్యాప­కుల ఉద్యోగాలకు జగన్‌ ఎసరు’ అంటూ అసత్య కథనాన్ని అచ్చేశారు. దీనిని ఉన్నత విద్యామండలి గురువారం ఓ ప్రకటనలో ఖండించింది. 

3,295 పోస్టుల భర్తీ 
ప్రభుత్వం ఉన్నత విద్యపై ప్రత్యేక దృష్టి సారించింది. చంద్రబాబు హయాంలో చేసిన తప్పులను సరిదిద్దుతూ బోధన సిబ్బంది నియా­మ­కాలు చేప­డుతోంది. వర్సిటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో 3,295 పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. దీనిని జీర్ణించుకోలేని రామోజీ­రావు ఒ­ప్పం­ద ఉద్యోగులకు భద్ర­త కరు­వైందంటూ ఊహా­జనిత వార్త­ను అ­చ్చే­శారు. వాస్త­వానికి రాష్ట్రంలో 20 వర్సి­టీల్లో దాదాపు 3,046 మంది ఒప్పంద అధ్యా­పకులు పని చేస్తు­న్నారు. వీరి­లో అత్యధిక శాతం సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌ ప్రోగ్రామ్‌లలో ఉన్నారు. వ­ర్సి­టీ­ల్లో కొత్తగా చేపడుతున్న అధ్యాపక నియా­మకా­లన్నీ రెగ్యులర్‌ పోస్టుల్లోనివే. అందువల్ల సెల్ఫ్‌ ఫైనాన్స్‌డ్‌ ప్రోగ్రామ్‌లలో పని చేస్తున్న ఒప్పంద అధ్యాపకు­లకు ఎటువంటి ఇబ్బందీ లేదు.

వెయిటేజీతో భరోసా
వర్సిటీల్లో పోస్టుల భర్తీలోనూ ఒప్పంద అధ్యాపకు­లకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెయి­టేజీ రూపంలో భరోసా కల్పించారు. దీనిపై త్వర­లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ వెయిటేజితో చాలా మంది ఒప్పంద అధ్యాపకులు రెగ్యులర్‌గా మారతారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం గ­తంలో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్‌ చేసింది. అయితే వర్సిటీల్లో ఒప్పంద ఉద్యోగుల క్రమ­బద్ధీ­కరణకు కొన్ని ప్రతిబంధకాలు ఉన్నాయి. చాలా వర్సిటీల్లో ఒప్పంద అధ్యాపకులను నియ­మించేటప్పుడు రిజిర్వేషన్‌ విధానాన్ని అవలంభించలేదు. రోస్టర్‌ పద్ధతిని పాటించలేదు.ఏ వర్సిటీ కూడా యూజీసీ నిర్దేశించిన పద్ధతుల్లో ఒప్పంద అధ్యాపకులను నియమించలేదు.

కొన్ని వర్సిటీల్లో ఎవరు సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులకు పని చేస్తున్నారు, ఎవరు రెగ్యులర్‌ పోస్టు­లకు పని చేస్తున్నారో కూడా తెలి­యదు. ఆ వ్యత్యా­సా­న్ని పాటించలేదు. మరీ ముఖ్యంగా ఆర్థిక శాఖ ఆమోదాన్ని పొందలేదు. వీటన్నింటీకి తోడు కోర్టు ఉత్తర్వులు వీరిని రెగ్యులరైజ్‌ చేయడానికి ప్రతిబంధకా­లుగా మారాయి. అంతేగానీ ఎవరికీ అన్యా­యం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. రాష్ట్రంలోని వర్సిటీల్లో పని చేస్తున్న పలువురు ఒప్పంద అధ్యాపకులు రెగ్యులర్‌ అవుతారు. మిగతా వారు ఇప్పుడున్నట్లుగానే కాంట్రాక్టు పద్ధతిలో కొనసాగుతారు. ఎవరి ఉద్యోగాలకూ ఎటువంటి ఇబ్బందీ ఉండదు. పైగా కాంట్రాక్టు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా వెయిటేజీని ప్రస్తా­విస్తుంటే వారి ఉద్యోగాలు పోతాయంటూ ఈనాడు దుర్మార్గపు రాతలు రాయడం సిగ్గుచేటు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి