Breaking News

పవన్‌ పర్యటనలో నకిలీ ఐపీఎస్‌

Published on Sun, 12/29/2024 - 05:30

సాలూరు: పవన్‌కళ్యాణ్‌ ఈ నెల 20న పార్వతీ­పురం మన్యం జిల్లా  గిరి శిఖర గ్రామమైన సిరివర రహదారి శంకుస్థాపనలో పాల్గొన్నారు. పర్య­టనలో మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఎమ్మె­ల్యేలు, కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్, ఎస్పీ మాధవరెడ్డి పాల్గొన్నారు. అయితే ఆయన పర్యటనలో భద్రతా లోపం ఆలస్యంగా వెలుగు చూసింది. ఏకంగా భద్రతా దళాల కళ్లుగప్పి.. ఐపీఎస్‌ అధికారినంటూ ఓ డూప్లికేట్‌ పోలీస్‌ హల్‌చల్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

నకిలీ ఐపీఎస్‌ అరెస్ట్‌
స్వప్రయోజనాల కోసం ఐపీఎస్‌ అవతారమెత్తిన నకిలీ ఐపీఎస్‌ బి.సూర్యప్రకాశ్‌ను పోలీసులు శని వారం అరెస్ట్‌ చేశారు. దీనికి సంబంధించిన వివరాలను అడిషనల్‌ ఎస్పీ దిలీప్‌కిరణ్‌ వివరించారు. విజయనగరం జిల్లా అంబటివలస గ్రామానికి చెందిన బి.సూర్యప్రకాశ్‌ 2003 నుంచి 2005 వరకు పంజాబ్‌ రెజిమెంట్‌లో సిపాయిగా పనిచేసి మానే శాడు. తరువాత బీటెక్, ఎంబీఏ పూర్తిచేసి పలు వ్యాపారాలు సాగించాడు. తన తండ్రి తవిటి బాబు కరోనాతో 2020లో మృతి చెందారు.

ఆ సమయంలో తన తండ్రి ఎకరాకు రూ.30 వేల చొప్పున చెల్లించి దత్తిరాజేరు మండలం గడసాం రెవెన్యూ పరిధిలో సుమారు 9.79 ఎకరాలను అగ్రిమెంట్‌ చేసుకున్నట్టు ఇంట్లో లభ్యమైన ప త్రాల ద్వారా సూర్యప్రకాశ్‌ తెలుసుకున్నాడు. తండ్రి మరణంతో ఆ భూమిని రిజిస్ట్రేషన్‌ చేసేందుకు రావాలని సదరు రైతులను సూర్యప్రకాశ్‌ కోరగా నిరాకరించారు.  తను ఐపీఎస్‌కు సెలెక్ట్‌ అయ్యా నని డిసెంబర్‌ 2023లో కుటుంబీకులు, బంధు వులను నమ్మించాడు. ట్రైనింగ్‌ కోసమంటూ 2024 జనవరిలో హైదరాబాద్‌ కు వెళ్లాడు. అక్కడ హాస్టల్‌లో ఉండి పోలీస్‌ యూనిఫాం, నకిలీ ఐడీ కార్డులు తయారు చేయించాడు. తను ట్రైనింగ్‌లో ఉన్నట్టు ఫొటోలు తీయించుకుని బంధువులకు పంపించాడు. ఆ ఫొటోలు, ఐడీ కార్డులను చూపించి ఆ భూములను రిజి స్ట్రేషన్‌ చేయాలంటూ రైతులపై ఒత్తిడి తెచ్చినా ముందుకు రాలేదు. 

పోలీస్‌నని నమ్మించేందుకే..
రైతులందరినీ తాను పోలీస్‌ అయినట్టు నమ్మించాలని ప్లాన్‌చేసి.. ఈ నెల 20న డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ మక్కువ పర్యటనకు వచ్చిన నేప థ్యంలో ఉదయం 9.30 గంటలకు ముడిదాం నుంచి డ్రైవర్‌తో కలిసి సూర్యప్రకాశ్‌ కారులో మక్కువ కు చేరుకున్నాడు. దుగ్గేరు వద్ద పోలీసులు మంత్రి కాన్వాయ్‌ వెహికల్స్‌ తప్ప మిగిలిన వాహనాలను నిలిపివేశారు. సూర్యప్రకాశ్‌ కారును కూడా అక్కడే ఆపేశారు. దీంతో అతడు కారు దిగి కొంతదూరం కాలినడకన వెళ్లి, అక్కడ నుంచి ద్విచక్ర వాహనంపై లిఫ్ట్‌ అడిగి బాగుజోలకు చేరుకున్నాడు. అప్ప టికే  శంకుస్థాపన కార్యక్రమం పూర్తికావడం, అక్క డ ఎవరూ లేకపోవడం చూసి శిలాఫలకం దగ్గర ఫొటో తీసుకున్నాడు. అక్కడ బందోబస్తులో ఉన్న పలువురు పోలీసులతో ఫొటోలు దిగి ఇంటికి వెళ్లిపోయాడు. వాటిని వాట్సాప్‌ స్టేటస్‌లో పెటు కున్నాడు. విషయం తెలుసుకున్న మక్కువ పోలీ సులు  సూర్యప్రకాశ్‌ను అరెస్ట్‌ చేశారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)