Breaking News

కేసరపల్లిలో నకిలీ బీరు కలకలం!

Published on Tue, 10/14/2025 - 05:23

గన్నవరం : కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి శివారులో ఉన్న ఓ వైన్‌ షాపులో నకిలీ బీరు కలకలం సృష్టించింది. ఈ షాపులో కొన్న బీరు నకిలీదంటూ కొనుగోలుదారులు సిబ్బందితో గొడవకు దిగారు. దీనికి సంబంధించిన వీడియా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కేసరపల్లి ఏలూరు కాలువ సమీపంలో టీడీపీ సిండికేట్‌ ఆధ్వర్యంలో చిల్లీస్‌ వైన్‌ షాపు నడుస్తోంది. 

ఆదివారం ఈ మద్యం దుకాణంలో ఇద్దరు వ్యక్తులు బీరు బాటిళ్లు కొన్నారు. అందులోని ఒక బాటిల్‌లో బీరుకు బదులుగా నీళ్ల రుచితో ఉన్న ద్రవం ఉందని, ఇది నకిలీ అని వైన్‌ షాపు సిబ్బందితో గొడవకు దిగారు. తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా నకిలీ మద్యం విక్రయిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎక్సైజ్‌ సీఐ సురేఖ సోమవారం ఈ వైన్‌ షాపును తనిఖీ చేశారు. 

వివాదానికి కారణమైన బీరు కేసులను పరిశీలించి, అవి నకిలీవి కాదని తెలిపారు. ఇదిలా ఉండగా, నకిలీ బీరు విక్రయించారనే గొడవ ఆదివారం చోటుచేసుకోగా, సోమవారం ఎక్సైజ్‌ అధి­కారులు తనిఖీ చేసి.. బీర్లు నకిలీవి కాదని చెప్పడం పట్ల స్థానికులు విస్తుపోతున్నారు. బీరు కేసులను మార్చిఉండరనే గ్యారంటీ ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)