Breaking News

మార్చి ఒకటి నుంచి ఫేస్‌ రికగ్నిషన్‌

Published on Tue, 02/21/2023 - 04:10

తిరుమల: తిరుమల శ్రీవారి సర్వదర్శనం, లడ్డూ ప్రసాదం, గదుల కేటాయింపు, రీఫండ్‌ చెల్లింపు తదితర అంశాల్లో మరింత పారదర్శకత పెంచేందుకు వీలుగా మార్చి ఒకటో తేదీ నుంచి ఫేస్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీని టీటీడీ ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. సర్వదర్శనం కాంప్లెక్స్‌లో ఒకే వ్యక్తి అధిక లడ్డూ టోకెన్లు పొందకుండా నివారించడానికి, గదుల కేటాయింపు కేంద్రాలు వద్ద, కాషన్‌ డిపాజిట్‌ కౌంటర్ల వద్ద ఈ టెక్నాలజీని వినియోగిస్తారు.

అదేవిధంగా దళారీలను ఏరివేసేందుకు కూడా ఇది ఎంతగానో దోహదపడనుంది. కాగా, తిరుమలలో ఆదివారం అర్ధరాత్రి వరకు 79,555 మంది స్వామివారిని దర్శించుకున్నారు. టికెట్లు లేని వారికి ఆరు గంటల్లో దర్శనం లభిస్తోంది. శ్రీవారిని సోమవారం రాష్ట్ర హోం శాఖ మంత్రి తానేటి వనిత, హిమాచల్‌ప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి జయరామ్‌ ఠాకూర్, ఎస్పీఎఫ్‌ డీజీ సంతోష్‌ మెహ్రా, నీతి ఆయోగ్‌ సభ్యుడు రమేష్‌ చంద్‌ (న్యూఢిల్లీ)  దర్శించుకున్నారు.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)