Breaking News

‘మార్కెట్‌’లో సౌందర్యలహరి

Published on Wed, 04/05/2023 - 05:10

అందానికి దాసోహమవని వారు ప్రపంచంలో ఉంటారా? సౌందర్యారాధన లేని వారు ఉంటారా? అందుకే సౌందర్య ఉత్పత్తులకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ పెరుగుతోంది. పట్టణాల్లోనే కాదు గ్రామాల్లోనూ బ్యూటీ పార్లర్లు, స్టైలిష్‌ హబ్‌లు వెలుస్తున్నాయి. ఫేస్‌వా ష్లు, మాయిశ్చరైజర్ల నుంచి కంటి క్రీమ్‌లు, ఫేస్‌ మాస్‌్కలు, సన్‌స్క్రీన్‌ లోషన్‌తో అన్నింటినీ మహిళలు, పురుషులు, పిల్లల కోసం కంపెనీలు ప్రత్యేకంగా తయారు చేస్తున్నాయి.

2018లో ప్రపంచ వ్యాప్తంగా సౌందర్య ఉత్పత్తుల మార్కెట్‌ 134.8 బిలియన్‌ డాలర్లు ఉంటే, 2021 నాటికి 532 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 2024 నాటికి 893 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని జియాన్‌ మార్కెట్‌ రీసెర్చ్‌(జీఎంఆర్‌) విభాగం అంచనా వేసింది. 2020 నుంచి భారతదేశంలో ప్రీమియం సౌందర్య ఉత్పత్తులకు డిమాండ్‌ పెరుగుతున్నట్టు గుర్తించింది.

ప్రస్తుతం చర్మ, సౌందర్య ఉత్పత్తుల వినియోగంలో 80 శాతం మంది మహిళలే ఉన్నారు. వచ్చే ఐదేళ్లలో పురుషుల సౌందర్య, గ్రూమింగ్‌ ఉత్పత్తులు కూడా భారీగా పెరుగుతాయని, దాంతో యునిసెక్స్‌ ఉత్పత్తుల తయారీ విస్తరిస్తుందని జీఎంఆర్‌ అంచనా వేసింది. 

చర్మ సౌందర్య ఉత్పత్తులే అధికం 
♦ 2021లో మొత్తం సౌందర్య ఉత్పత్తుల కొనుగోళ్లలో 148.3 బిలియన్‌ డాలర్లు కేవలం చర్మ రక్షణ ఉత్పత్తులదే.  
♦  పర్సనల్‌ కేర్‌ మార్కెట్‌లో 42 శాతం స్కిన్‌ కేర్‌ ఉత్పత్తులే ఉన్నాయి. తర్వాత స్థానంలో హెయిర్‌ కేర్‌ 22 శాతం, బ్యూటీ అండ్‌ మేకప్‌ కేర్‌ 16 శాతం ఉన్నాయి.  
♦  ప్రపంచ బ్యూటీ ఉత్పత్తుల మార్కెట్‌లో ప్ర­స్తుతం 7వ స్థానంలో ఉన్న భారత్‌.. వచ్చే మూ­డేళ్లలో 4వ స్థానానికి చేరుతుందని అంచనా.  
♦ సర్వే ప్రకారం భారత్‌లో సహజ సౌందర్య ఉత్పత్తుల మార్కెట్‌ 2022లో 15 బిలియన్‌ డాలర్లు ఉండగా, 2024 నాటికి 22 బిలియన్ల డాలర్లకు, 2028 నాటికి 38 బిలియన్‌ డాలర్లకు పెరుగుతుందని జీఎంఆర్‌ తెలిపింది.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?