Breaking News

నిషేధిత జాబితా నుంచి నెలలో ‘అసైన్డ్‌’కు విముక్తి 

Published on Sat, 08/19/2023 - 02:55

సాక్షి, అమరావతి: అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్ట సవరణ చేసిన ప్రభుత్వం.. దాన్ని వేగంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే దీనిపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయగా, ఎప్పటిలోగా పూర్తి చేయాలనే విషయంపై తాజాగా అధికార యంత్రాంగానికి టైం లైన్‌ నిర్దేశించింది.

నెల రోజుల్లో రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో కసరత్తు ముగించి అసైన్‌మెంట్‌ జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన అసైన్డ్‌ భూములను నిషేధిత ఆస్తుల జాబితా (22)ఏ నుంచి తొలగించాలని ఆదేశించింది.

అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తూ చట్ట సవరణ చేసిన గత నెల 31వ తేదీకి ఈ భూములు సంబంధిత రైతులు, వారి వారసులు లేదా లీగల్‌ హైర్స్‌ ఆదీనంలో ఉంటే వారికి యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ జి. సాయిప్రసాద్‌ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.   

వారం నుంచి నెల రోజుల గడువు 
రైతుకు కేటాయించి 20 సంవత్సరాలు పూర్తయిన అసైన్డ్‌ భూములను 22 (ఎ) నుంచి తొలగించేందుకు వీఆర్‌వో నుంచి తహశీల్దార్, జేసీ, కలెక్టర్లు చేయాల్సిన పనులను కూడా వివరిస్తూ ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది. ఇప్పుడు 50 ఎకరాల వరకు అసైన్డ్‌ భూములున్న గ్రామాల్లో వారం రోజుల్లో వాటిని 22(ఎ) నుంచి తొలగించాలని సూచించింది.

150 వరకు ఉంటే రెండు వారాలు, 250 ఎకరాలు ఉంటే మూడు వారాలు, 250 ఎకరాలకు పైబడి అసైన్డ్‌ భూములుంటే నాలుగు వారా­ల్లో (నెల రోజుల్లో) ఆ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని స్పష్టం చేసింది. ఈ గడువు ప్రకారం పని జరిగేలా జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా 22 లక్షల ఎకరాల అసైన్డ్‌ భూములపై రైతులకు యాజమాన్య హక్కులు లభిస్తాయి. ఈ భూము­లపై హక్కులు ఇవ్వాలని అనేక సంవత్సరాలుగా కోరుతున్న 15 లక్షల మందికిపైగా రైతులు లబ్ధి పొందనున్నారు. వారిలో మెజారిటీ రైతులు దళితులే.  

Videos

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)