Breaking News

పారాసెటమాల్‌..వాడకం.. జర భద్రం...!

Published on Mon, 01/20/2025 - 05:04

ఏపీ సెంట్రల్‌ డెస్క్‌: పారాసెటమాల్‌.. ఈ ట్యాబ్‌లెట్‌ గురించి తెలియని వారుండరు. కరోనా తరువాత దీనికి మరింత గుర్తింపు వచ్చింది. జ్వరం రాగానే చాలామంది డాక్టర్‌ను సంప్రదించకుండానే వేసుకునే మందు బిళ్ల ఇది. అదీ కాకుండా నొప్పులకు కూడా పనిచే­స్తుందని తెలిసిన తరువాత దీని వినియోగం మరింత పెరిగింది. 

ఇదిలా ఉంటే.. చిన్న, చిన్న నొప్పులకు కూడా ఈ ట్యాబ్‌­లెట్‌ను జనం విస్తృతంగా వాడేస్తున్నారు. ఇలా వినియోగించడం ఆరోగ్యానికి ప్రమాదమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అతిగా వినియోగిస్తే కాలే­యా­­నికి హాని చేస్తుందని, కిడ్నీ సమస్యలు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవ­కా­శం ఉందని చెబుతు­న్నారు. పారాసెట­మాల్‌ విషపూరి­తంగా మారితే ఎక్కువ శాతం స్త్రీలే ముప్పు ఎదుర్కొంటు­న్నారు.

కాలేయానికి హాని: 
పారాసెటమాల్‌ను అధిక మోతాదులో విని­యో­గిస్తే కాలేయానికి తీవ్ర హాని చేస్తుంది. ఈ మందును తీసుకున్నప్పుడు కాలేయం దీన్ని సమర్ధంగా ప్రాసెస్‌ చేయలేకపోతుంది. ఆ సమయంలో వచ్చే విషపూరిత ఉత్పత్తుల వల్ల కాలేయ కణాలు దెబ్బతింటాయి. కొన్ని పరిస్థి­తుల్లో కాలేయ వైఫల్యానికి దారి తీసే అవకాశం ఉంటుంది. వికారం, వాంతులు, కడుపునొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.

కిడ్నీ సమస్యలు: 
దీర్ఘకాలం పాటు అధిక మోతాదులో పారాసెట­మాల్‌ తీసుకోవడం వల్ల కిడ్నీలకు కూడా హాని కలుగుతుంది. పనితీరు దెబ్బతింటుంది. మూత్ర­­వి­సర్జనలో మార్పులు, కాళ్లవాపు, అలసట, రక్తపోటు వంటి సమస్యలు తలెత్తుతాయి. 

గుండె సంబంధిత సమస్యలు:
ఎక్కువమంది పారాసెటమాల్‌ ను నిర్లక్ష్యంగా వాడటం వల్ల గుండెపోటు, రక్తనాళాల కుదింపు/రక్తప్రవాహం మార్పు వంటి గుండె సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక మరికొంతమందికి అలెర్జీ సమస్యలు రావచ్చు. చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముఖం, పెదవులు, నాలుక వాపు వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది.

అతి వినియోగం.. అనర్ధదాయకం
పారాసెటమాల్‌ టాబ్లెట్‌ను డోస్‌కు మించి అతిగా వినియోగించకూడదు. అలా చేస్తే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపు­తుంది. పేగుపూత, కాలేయం దెబ్బతిన­డం, కామె­ర్లు, కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఒక్కో సందర్భంలో గుండె సంబంధిత వ్యాధులకూ దారి తీయవచ్చు.  – డాక్టర్‌ జె. నాగరాజు, డిప్యూటీ సివిల్‌ సర్జన్, ఏరియా ఆస్పత్రి, నరసరావుపేట. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి