Breaking News

ఐరాస సదస్సుకు ఎటపాక కేజీబీవీ విద్యార్థిని

Published on Sat, 08/12/2023 - 05:17

ఎటపాక (అల్లూరి సీతారామరాజు జిల్లా): ఐరాస సదస్సుకు అల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా ఎటపాక కేజీబీవీ విద్యార్థిని మోతుకూరి చంద్రలేఖ ఎంపికైంది. 2022–23 విద్యాసంవత్సరం పదవ తరగతిలో 523 మార్కులు సాధించి జిల్లా­లోని 19 కేజీబీవీల్లో టాపర్‌గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విభాగాల పాఠశాలల టాపర్స్‌­కు జగనన్న ఆణిముత్యాలు పథకంలో భాగంగా గత నెలలో ఆన్‌లైన్‌లో పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వ­హించారు. ఈ పరీక్షలో చంద్రలేఖ 100 మార్కు­లకు గాను 94 మార్కులు సాధించి ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూకు ఎంపికైంది.

ఈమెతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కేజీబీవీల నుంచి ఇద్దరు ఇంటర్వ్యూకు హాజరు కాగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన చంద్రలేఖ ఐరాస సదస్సుకు ఎంపికైంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి శుక్రవారం ఆమెకు సమాచారం అందింది. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న విప్లవాత్మకమైన విద్యా ప్రమాణాలపై ఐరాస సదస్సులో చంద్రలేఖ మాట్లాడనున్నట్లు గర్ల్స్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అధికారిణి కె.సూర్యకుమారి తెలిపారు. త్వరలో విద్యార్థిని యూఎస్‌ఏ వెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేపడుతుందని చెప్పారు. కాగా, సీఎం జగన్‌ సంకల్పం నెరవేరుతోందనడానికి ఈ పేదింటి విద్యార్థిని ఇప్పుడు ఐరాస సదస్సుకు వెళ్లడమే నిదర్శనం.

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)