Breaking News

పోటీ పరీక్ష రాసేందుకు వెళుతూ..

Published on Fri, 01/24/2025 - 08:20

మర్రిపాలెం: రాజమహేంద్రవరం శివారు గామన్‌ వంతెనపై బుధవారం అర్ధరాత్రి కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తాపడిన ఘటనలో నగరంలోని 53వ వార్డు మర్రిపాలెం పార్వతీనగర్‌కు చెందిన హోమిని కల్యాణి (21) మృతి చెందింది. దువ్వాడలోని ఓ ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న కల్యాణి కాంపిటేటివ్‌ పరీక్ష రాయడానికి హైదరాబాద్‌ బయలుదేరింది. 

బుధవారం రాత్రి ఎన్‌ఏడీ కొత్తరోడ్డులో బస్సు ఎక్కగా..అర్ధరాత్రి రాజమండ్రి గామన్‌ వంతెన వద్ద బస్సు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కల్యాణి అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతురాలు శరీరం నుజ్జునుజ్జవ్వడం అందర్నీ కలచి వేసింది. గురువారం సాయంత్రం కల్యాణి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అందివచ్చిన కుమార్తె ఇలా విగతజీవిగా ఉండడాన్ని తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

కల్యాణి తండ్రి రాఘవదాస్‌ రైల్వే ఉద్యోగి కాగా.. తల్లి లక్ష్మి(లత) గృహిణి. వీరికి ఇద్దరు కుమార్తెలు, కాగా పెద్ద కుమార్తె మేఘన ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉన్నత చదువులకు సిద్ధమవుతోంది. కల్యాణి ఇంజినీరింగ్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతూ పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతోంది. ఈ క్రమంలో కాంపిటేటివ్‌ పరీక్ష రాసేందుకు వెళుతూ మృతిచెందడంతో పార్వతినగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)