Breaking News

హుండీ లెక్కింపులో తప్పులు జరుగుతాయి

Published on Thu, 07/09/2026 - 05:18

సాక్షి, అమరావతి: ఆలయాల్లో హుండీ లెక్కింపులో, ఇతరత్రా తప్పులు జరుగుతాయని, అవన్నీ మామూ­లేనని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారా­యణరెడ్డి వ్యాఖ్యానించారు. అయితే తమ ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు. అయినా వీటిపై వైఎస్సార్‌­సీపీ రాద్ధాంతం చేస్తోందని మండిపడ్డారు. బుధ­వా­రం ఆయన దేవ­దాయ శాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్, దేవదాయశాఖ  సలహా­దారులు సీతారామాంజనేయ ప్రసాద్‌లతో కలిసి రాష్ట్ర సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. 

విజయవాడ దుర్గగుడి, అన్నవరం శ్రీవీరవేంకట సత్యనారాయణ స్వామి ఆలయం, పెనుగంచిప్రోలు, పెదకాకాని శ్రీభ్రమరాంబ మల్లేశ్వరస్వామి ఆలయాల్లో రెండేళ్లలో భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ, ఆలయ నికర ఆదాయం గతం కన్నా తగ్గడంపై వివరణ ఇచ్చేందుకు సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పి.. ఆ మాటే మాట్లాడ­లేదు. దేవదాయ శాఖ పరిధిలోని 22 పెద్ద ఆలయాల్లో ఉమ్మడిగా ఆదాయం పెరుగుదల గురించి మాత్రమే వివరణ ఇచ్చారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి గతంలో 93 లక్షల మంది భక్తులు రాగా, కూటమి ప్రభుత్వ హయాంలో ఆ సంఖ్య ఏకంగా 1 కోటి 19 లక్షల మందికి పెరిగిందని చెబుతూ.. ఆదాయంలో తగ్గుదల విషయాన్ని దాట వేశారు. 

అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో మెరుగైన వసతులు కల్పించడం వల్ల భక్తుల సంఖ్య పెరిగిందన్నారు. విజయవాడ దుర్గగుడి భూముల్లో కొనసాగుతున్న సిద్ధార్థ విద్యా సంస్థల లీజు గడువు ఏడాది క్రితమే  ముగిసిందని, అయితే ఆ విద్యా సంస్థ లీజు గడువు పొడిగించాలని కోరడంతో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గంలో చర్చించి దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజల నుంచి లభిస్తున్న విశేష ఆదరణను జీర్ణించుకోలేక కొందరు ఉద్దేశ పూర్వక దుష్ప్రచారాలు, సమాజాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పారు. అలాంటి వారందరిపై రాజ ద్రోహం కేసు నమోదు చేయాల్సిన అవసరం ఉందన్నారు.   

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)