Breaking News

అల్లూరి ఏజెన్సీలో భారీ ఎన్‌కౌంటర్‌.. మృతుల వివరాలు ఇవే..

Published on Wed, 11/19/2025 - 09:20

సాక్షి, అల్లూరి జిల్లా: ఏపీలో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తాజాగా అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఏజెన్సీలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలిసింది.

వివరాల ప్రకారం.. అల్లూరి జిల్లాలోని ఏజెన్సీలో మావోయిస్టులు ఏరివేత కార్యక్రమం కొనసాగుతోంది.  బుధవారం ఉదయం మారేడుమిల్లి మండలం  జీఎంవలస సమీపంలో మరో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బుధవారం ఉదయం ఆరు నుంచి ఏడు గంటల మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో శ్రీకాకుళానికి చెందిన ఆంధ్ర, ఒడిస్సా ఇంఛార్జ్‌ జోగారావు అలియాస్ టెక్ శంకర్ మృతి చెందారు. వెపన్స్‌ డీలింగ్‌లో శంకర్‌ది కీలక పాత్ర. మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఇక.. ఈ ఎన్‌కౌంటర్‌ను ఏడీజీ మహేష్ చంద్ర లడ్డా మీడియా సమావేశం సందర్బంగా ధృవీకరించారు. 

ఏడుగురు మృతులు వీరే..

1. మెట్టూరి జోగా రావు @ టెక్ శంకర్ @ శంకర్.. బతుపురం (v), వజ్రపు కొత్తూరు (M), శ్రీకాకుళం. SZCM, ఇంఛార్జ్ AOB

2. ⁠జ్యోతి @ సరిత, DVCM, (గతంలో నంబాల కేశవ రావు @ BR దాదా మాజీ మావోయిస్టు చీఫ్‌కి గార్డ్ కమాండర్‌గా పనిచేశారు) 32 సంవత్సరాలు, n/o బూర్గులంక ప్రాంతం (కిస్టారం ప్రాంతం), సుక్మా జిల్లా.

3. సురేష్ @ రమేష్, ACM (గతంలో జగరగొండ LOS, SBT DVC & ఎర్రా SZCM కమ్యూనికేషన్ టీమ్‌లో పనిచేశారు).

4. లోకేష్ @ గణేష్, ACM (గతంలో జగరగొండ ఏరియా మిలీషియా కమాండర్, SBT DVC & కటకం సుదర్శన్ @ ఆనంద్ దాదాకు గార్డుగా పనిచేశారు).

5. సైను @ వాసు, ACM (గతంలో జగరకొండ LOS, SBT DVC యొక్క Dy. కమాండర్‌గా పనిచేశారు).

6. అనిత, ACM (గతంలో జగరగొండ LOS, SBT DVCలో పనిచేశారు).

7. షమ్మీ ACM (గతంలో జగరగొండ LOS, SBT DVCలో పనిచేశారు)..

 

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)