Breaking News

విశాఖ వేదికగా మిలన్‌–2024

Published on Wed, 08/30/2023 - 04:20

సాక్షి, అమరావతి: తూర్పు నావికాదళం విశాఖ­పట్నం వేదికగా వచ్చే ఫిబ్రవరిలో మిలన్‌–2024 నిర్వహించనుంది. తూర్పు నావికా­దళం ఫ్లాగ్‌ ఆఫీసర్‌ కమాండింగ్‌ ఇన్‌ చీఫ్, వైస్‌ అడ్మి­రల్‌ రాజేశ్‌ పెందార్కర్‌ మంగళవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు. మిలన్‌–2024 నిర్వహణ వివరాలను సీఎంకు తెలియజేశారు. విశాఖపట్నంలో నిర్వహించే మిలన్‌–2024కు 57 దేశాల ప్రముఖులు, నౌకా­­ద­­ళాలు పాల్గొనే అవకాశముందని చెప్పా­రు.

సముద్ర భద్రతకు సంబంధించి తలెత్తుతున్న సవాళ్లను అధిగవిుంచేందుకు తాము చేపట్టిన వివిధ కార్యక్రమాలను తెలియజేశారు. ఈ సందర్భంగా రాజేశ్‌ పెందార్కర్‌ను సీఎం జగన్‌ సత్కరించి వేంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేయగా.. రాజేశ్‌ ముఖ్యమంత్రికి ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం షిప్‌ మోడల్‌ను బహూకరించారు. సమావేశంలో నేవీ ఉన్నతాధికారులు కెప్టెన్‌ వీఎస్‌సీ రావు, కెప్టెన్‌ రోహిత్‌ కట్టోజు, కమాండర్‌ వైకే కిశోర్, లెఫ్టినెంట్‌ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర సచివాలయంలో సీఎస్‌ జవహర్‌రెడ్డిని తూర్పు నావికాదళ అధికారులు మర్యాదపూర్వకంగా కలిశారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి