Breaking News

బలవన్మరణాలకు పాల్పడుతున్నా పట్టదా?

Published on Tue, 02/17/2026 - 04:48

సాక్షి ప్రతినిధి, కాకినాడ: పనిభారం పెంచేసి మానసిక ఒత్తిళ్లకు గురిచేస్తున్న చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ప్రభుత్వ ఉద్యోగులు సోమవారం నిరసన గళం వినిపించారు. రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉద్యోగులు  తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగారు. కరప, ఉప్పాడకొత్తపల్లి, తుని రూరల్, నిడదవోలు తదితర మండలాల్లో ధర్నాలు చేపట్టారు.

కొన్ని చోట్ల భోజన విరామ సమయంలో కార్యాలయాల వద్ద నిరసన తెలపగా, మరికొన్ని చోట్ల వీఆర్వోలు, సర్వేయర్లు, వీఆర్‌ఏలు నల్లబ్యాడ్జీలతో ధర్నాలు చేశారు. సర్వీసు రూల్స్‌కు విరుద్ధంగా ఇష్టమొచ్చినట్టు పనులు అప్పగించి తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురిచేస్తుండటంతో ఉద్యోగులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ శాఖ పరిధిలో పనిచేయాలో తెలియక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.

వీఆర్వో, వీఆర్‌ఏ, సర్వేయర్‌లు ఇలా అందరినీ డీడీవో పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్‌లు పరిష్కరించకుంటే మార్చి1 నుంచి పెన్‌డౌన్‌ చేపడతామని హెచ్చరించారు. ఉన్నతాధికారులకు తమ సమస్యలను తెలియజేసినా న్యా­యం చేయకపోవడంతోనే రాష్ట్ర సంఘం నిర్ణయం మేరకు ఈ నెల 12న వర్క్‌ టు రూల్‌ అమలు చేస్తుంటే, కొంతమంది అధికారులు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం అన్యాయమన్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)