Breaking News

సారూ.. జీతాలెప్పుడు?

Published on Mon, 10/07/2024 - 05:28

సాక్షి, అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు రెండు మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా కాంట్రాక్టు ప్రాతిపదికన పని చేస్తున్న సమగ్ర శిక్ష, 108, 104.. ఆర్‌డబ్ల్యూఎస్‌ ల్యాబ్‌ ఉద్యోగులు జీతాలు అందక సతమతమవుతున్నా­రు. విద్యా శాఖలో కీలకమైన రాష్ట్ర సమగ్ర శిక్షలో పని చేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం వేధిస్తోంది. 

రెగ్యులర్‌ ఉద్యోగులతో సమానంగా వీరికి కూడా ప్రతినెలా ఒకటో తేదీనే జీతాలు ఇచ్చేలా సమగ్ర శిక్ష ఎస్పీడీ చర్యలు తీసుకుని, సంబంధిత ఫైలును ప్రభుత్వానికి పంపించారు. ఇది జరిగి మూడు నెలలు కావస్తున్నా.. సర్కారు నుంచి సానుకూల స్పందన రాకపోవడం గమనార్హం. సమగ్ర శిక్ష ద్వారా నిర్వహిస్తున్న విద్యా సంబంధ కార్యకలాపాల కోసం ఓటాన్‌ అకౌంట్‌ నుంచి రూ.413 కోట్ల నిధులను విడుదల చేస్తున్నట్టు ప్రభుత్వం గత నెలలో జీవో విడుదల చేసింది. 

కానీ ఇప్పటి వరకు నిధులు విడుదల చేయలేదు. దీంతో ఆగస్టు, సెపె్టంబర్‌ నెలలకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితి తలెత్తింది. సీఆర్‌ఎంటీలు, కేజీబీవీ టీచర్లతో పాటు పార్ట్‌టైమ్‌ ఇన్‌స్ట్రక్టర్లు, ఎంఈవో కార్యాలయాల్లో పని చేస్తున్న ఎంఐఎస్‌ ఇన్‌స్ట్రక్టర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, మెసెంజర్లు, అకౌంటెంట్లు, పీఈటీలు, ఉపాధ్యాయ శిక్షణ సిబ్బంది, మధ్యాహ్న భోజనం వంట వారు, నైట్‌ వాచ్‌మన్లు, వాచ్‌ ఉమెన్లు, కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచర్లు, పీజీటీలు, క్లస్టర్‌ రిసోర్సు మొబైల్‌ టీచర్లు తదితర 25 వేల మంది జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. వీరికి నెలవారి వేతనాలు రూ.6,500 నుంచి రూ.25 వేల వరకు ఉన్నాయి.  

లబోదిబోమంటున్న 108, 104 సిబ్బంది  
ఆగస్టు, సెపె్టంబర్‌ నెలల వేతనాలు అందక 108, 104 సిబ్బంది కూడా నానా అవస్థలు పడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 108 అంబులెన్స్‌లు 768.. 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌లు 936 ఉన్నాయి. అంబులెన్స్‌కు పైలట్, ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీíÙయన్‌(ఈఎంటీ), ఎంఎంయూలో డ్రైవర్‌తో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్‌(డీఈవో) పని చేస్తున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 104, 108లలో 6,500 మంది డ్రైవర్‌లు, ఈఎంటీ, డీఈవోలు సేవలు అందిస్తున్నారు. 

108 పైలట్, ఈఎంటీలకు నెలకు రూ.18 వేల నుంచి రూ.30 వేల వరకు, 104 ఎంఎంయూ డ్రైవర్, డీఈవోలకు రూ.15 వేల నుంచి రూ.27 వేల వరకు వేతనాలున్నాయి. వీరికి 104, 108 నిర్వహణ సంస్థ అరబిందో ఎమర్జెన్సీ మెడికల్‌ సర్విసెస్‌ వేతనాలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల వేతనాలు ఇంకా వీరికి అందలేదు. తమకు ప్రభుత్వం నుంచి ఆరు నెలలకుసంబంధించి రూ.140 కోట్ల బిల్లులు రావాల్సి ఉందని నిర్వహణ సంస్థ చెబుతోంది. 

అవి వస్తే గానీ పెండింగ్‌ వేతనాలను చెల్లించలేమంటున్నారని సిబ్బంది వెల్లడించారు. కాగా, ఇప్పటి వరకు సీఎఫ్‌ఎంఎస్‌లో బిల్లులు అప్‌లోడ్‌ చేయలేదని చెబుతున్నారు. కాగా, ఆర్‌డబ్ల్యూఎస్‌ ల్యాబ్‌లో పనిచేసే చిరుద్యోగులు జీతాల బకాయిల కోసం మరో విడత ఆదివారం మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ క్యాంపు కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. గత నెల 13న కూడా వీరు ఆందోళన చేపట్టారు. 

ఓ వైపు జూలై నుంచి జీతాలు రావడం లేదని, మరోవైపు రాజకీయ ఒత్తిళ్లతో ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని యూనియన్‌ అధ్యక్షుడు డి.మూర్తిరెడ్డి ఆధ్వర్యంలో పవన్‌ కళ్యాణ్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రతినెలా జీతం వస్తేనే తమ కుటుంబాలు గడుస్తాయని, ఇంటి అద్దె, కుటుంబ అవసరాలకు డబ్బుల్లేక అగచాట్లు పడుతున్నామని చెప్పారు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)