Breaking News

పాస్టర్‌ ప్రవీణ్‌ పగడాల కేసు.. చేతులు, ముఖంపై గాయాలు: డీఐజీ

Published on Sat, 03/29/2025 - 18:53

సాక్షి, తూర్పుగోదావరి: ఈ నెల 24న అనుమానాస్పద స్థితిలో కొంతమూరు సమీపంలో పాస్టర్ ప్రవీణ్ కుమార్‌ మృతి చెందినట్టు గుర్తించామని ఏలూరు రేంజ్‌ ఐజీ అశోక్ కుమార్‌ తెలిపారు. శనివారం.. ఎస్పీ కార్యాలయంలో కేసు వివరాలను మీడియాకు ఆయన వెల్లడించారు. ప్రవీణ్‌ బంధువులు వచ్చిన తర్వాత కేసు నమోదు చేశామని తెలిపారు. మృతిపై అనుమానాలు వ్యక్తం కావడంతో పూర్తిస్థాయిలో విచారణ చేపట్టామని.. తూర్పుగోదావరి ఎస్పీ ఆధ్వర్యంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.

ఈ నెల 24న ఉదయం 11 గంటలకు పాస్టర్ ప్రవీణ్ కుమార్‌ హైదరాబాద్ నుంచి బయలుదేరారు. మధ్యాహ్నం 1.29 గంటలకు చౌటుప్పల్ టోల్‌గేట్‌ దాటారు. విజయవాడలో మూడు గంటల పాటు ఆయన ఎక్కడున్నారనే విషయంపై ట్రాక్ చేస్తున్నాం. కొంతమూరు పెట్రోల్ బంక్ వద్దకు రాత్రి 11:40 గంటలకు చేరుకున్నారు. 11:42కు ఘటన జరిగింది. పోస్టుమార్టం రిపోర్టులో కొన్ని అంశాలకు సంబంధించి సమాచారం వచ్చింది. చేతులు, ముఖంపై కొన్ని గాయాలు ఉన్నాయని తేలింది.  పూర్తి వివరాలు ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత ప్రవీణ్‌ ఎలా మృతి చెందారనే విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కారు ఢీ కొడితే మోటార్ సైకిల్ కింద పడిందా లేదా.. అన్న విషయాన్ని కూడా ట్రాన్స్‌పోర్టు అధికారులు పరిశీలిస్తున్నారు.’’ అని ఐజీ చెప్పారు.

జిల్లా ఎస్పీ నర్సింహ కిషోర్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్, విజయవాడలో ఉన్న సీసీ కెమెరాల ద్వారా డేటా పరిశీలిస్తామని తెలిపారు. ‘‘అన్ని టోల్ గేట్ల వద్ద సీసీ ఫుటేజ్ తీసుకున్నాం. రాజమహేంద్రవరం ఎందుకు వచ్చారో పరిశీలించాం. లాలా చెరువు సమీపంలో కుమార్తె పేరిట ప్రవీణ్‌ కొంత స్థలం కొనుగోలు చేశారు. అక్కడ ఒక భవనం నిర్మించాలనుకున్నారు. దీని కోసం ఒక ఇంటిని కూడా అద్దెకు తీసుకున్నారు. ఆయన రాజమండ్రి వస్తున్నట్టు భార్య, స్థానికంగా ఉంటున్న ఆకాష్, జాన్‌కు మాత్రమే తెలుసు. కుటుంబ సభ్యులందరినీ విచారించాం. ఎఫ్‌ఎస్‌ఎల్‌ రిపోర్ట్స్ కూడా పరిశీలిస్తాం’’ అని ఎస్పీ తెలిపారు.

 

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)