Breaking News

నెలాఖరుకల్లా ఎన్నికల శిక్షణ పూర్తి చేయాలి

Published on Sun, 02/11/2024 - 05:05

సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ త్వరలో ప్రకటించనున్నందున అన్ని రకాల బృందాల శిక్షణను ఈ నెలాఖరుకల్లా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం రాష్ట్ర సచివాలయం నుండి  అన్ని జిల్లాల ఎన్నికల అధి­కా­రులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఎన్నికల సంసిద్ధత, ఓటర్ల జాబితా నవీకరణపై సమీక్షించారు.

ఈ సందర్బంగా మీనా మాట్లాడుతూ..   షెడ్యూలు ప్రకటించిన వెంటనే ఎన్నికల నియమావళి అమల్లోకి వస్తుందని చెప్పా­రు. దాని ప్రకారం ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, స్టాటిక్‌ సెరై్వలెన్స్, వీడియో వ్యూయింగ్, ఎలక్షన్‌ ఎక్సె్పండిచర్‌ మేనేజ్‌మెంట్‌ టీమ్‌లు, ఇతర బృందాల కార్యకలాపాలు ప్రారంభమవుతాయని తెలిపారు. అందువల్ల ఆ బృందాలకు వారి విధులపై సమగ్ర అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల నిర్వహణ, కౌంటింగ్‌లో పాల్గొనే అధికారులు, సిబ్బందికి శిక్షణను మార్చి నెలలో ఇవ్వవచ్చని చెప్పారు.

విధుల్లో చేరకపోతే చర్యలు తప్పవు
అన్ని జిల్లాల్లో ఆర్వోలు, ఏఆర్వోలు, ఈఆర్వోలు, ఏఈఆర్‌వోల నియామకం జరిగిందని, వారిలో ఇప్పటికీ విధుల్లో చేరని వారి వివరాలను వెంటనే తెలియజేయాలని ఆదేశించారు. వారి సమాచారాన్ని ప్రభుత్వానికి పంపి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కేంద్ర ఎన్ని­కల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లకు సౌకర్యాలు కల్పించే బృందాలు, హోమ్‌ ఓటింగ్‌ బృందాల్లో తగినంత మందిని సమకూర్చుకోవాలని సూచి­ంచారు.

విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధులకు ఇంటి వద్దే ఓటింగ్‌కు అవకాశం ఉన్న­ందున రెవెన్యూ అధికారులు, సిబ్బందితో హోం ఓటింగ్‌ బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. పోలింగ్‌ సిబ్బంది డేటాను సంబంధిత పోర్టల్‌లో వెంటనే ఫీడ్‌ చేయాలన్నారు. ఎలక్షన్‌ సీజర్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టంను  పటిష్టంగా అమలు పర్చే­ందుకు రెగ్యులేటరీ అథారిటీలతో సమన్వయం చేసుకోవాలని, ప్రతి అథారిటీ నుండి తప్పనిసరిగా ఒక నోడల్‌ అధి­కారి ఉండాలని అన్నారు.

ఈవీఎంలను తరలించే వాహనాలు, ఫ్లయింగ్‌ స్క్వాడ్లు, ఇతర బృందాల వాహ­నా­లకు తప్పనిసరిగా జీపీఎస్‌ ఉండా­లని చెప్పారు. జిల్లా కేంద్రం నుండి బ్లాక్‌ స్థాయి వరకు అందరు అధికారులతో పటిష్టమైన కమ్యూ­ని­కేషన్‌ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని మీనా ఆదే­శించారు.

సమస్యాత్మక పోలింగ్‌ స్టేషన్లు అన్నింటికీ తప్పనిసరిగా మైక్రో అబ్జర్వర్లను నియమించాలని, వెబ్‌ కాస్టింగ్, మీడియో కవరేజిల్లో పోలింగ్‌ కేంద్రాల పరిసరాలను కూడా చిత్రీకరించాలని చెప్పా­రు. అందుకు అవసరమైన వీడియోగ్రాఫర్లను, జిల్లా స్థాయిలోనే సమకూర్చుకోవాలన్నారు. ఈ సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)