Breaking News

ఎల్లుండి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎన్నిక

Published on Sun, 06/29/2025 - 05:10

సాక్షి, అమరావతి: ప్రతి మూడేళ్లకొకసారి జరిగే పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా మంగళవారం బీజేపీ రాష్ట్ర కొత్త అధ్యక్ష ఎన్నిక జరగనుంది. ఈ మేరకు పార్టీ సంస్థాగత ఎన్నికల అధికారి, రాజ్యసభ సభ్యుడు పాకా వెంకట సత్యనారాయణ శనివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ అధ్యక్ష ఎన్నిక షెడ్యూల్‌ను ప్రకటించారు. జూన్‌ 29న (ఆదివారం) రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక నోటిఫికేషన్‌ జారీతోపాటు అధ్యక్ష ఎన్నిక ఓటర్ల జాబితాను ప్రకటించనున్నట్టు వెల్లడించారు. 

30న (సోమవారం) ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య నామినేషన్‌ దాఖలు.. అనంతరం ఒక గంటపాటు నామినేషన్ల స్రూ్కటినీ.. సాయంత్రం నాలుగు గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందని వివరించారు. ఒకటో తేదీన పోలింగ్, రాష్ట్ర అధ్యక్ష పేరు ఖరారు ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు. కర్ణాటక ఎంపీ పీసీ మోహన్‌ ఎన్నికల పరిశీలకులుగా వ్యవహరిస్తారని వివరించారు.  

రేసులో సుజనా చౌదరి, జీవీఎల్‌ కూడా! 
బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పోటీ పడుతున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న పురందేశ్వరి కొనసాగే అవకాశాలు చాలా తక్కువని తెలుస్తోంది. ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన అధినేతల సూచనలు పరిగణనలోకి తీసుకుంటే తప్ప ఆమె మరో విడత కొనసాగే అవకాశాలు లేవని పార్టీలో చర్చ సాగుతోంది. 

అధ్యక్ష మారి్పడి జరిగే పక్షంలో తమ పేర్లు పరిశీలించాలంటూ కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు పార్టీ సీనియర్‌ నేతలు పీవీఎన్‌ మాధవ్, జీవీఎల్‌ నరసింహరావు, సుజనాచౌదరి, నరసింహారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి తదితరులు పార్టీ జాతీయ నాయకత్వాన్ని కోరినట్టు సమాచారం.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)