‘సర్‌’ మరో పదిరోజులు!

Published on Wed, 07/15/2026 - 04:06

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియను పది రోజుల పాటు పొడిగిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. ముందుగా నిర్ణయించిన మేరకు మంగళవారంతో సర్‌ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే వివిధ రాజకీయ పార్టీలతో పాటు అధికార యంత్రాంగం గడువు పొడిగించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ వచ్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సర్‌ గడువును పది రోజుల పాటు అంటే ఈ నెల 24వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల కమిషన్‌ మంగళవారం ప్రకటించింది. 24వ తేదీ వరకు బీఎల్‌వోలు ఇంటింటి సందర్శనలు చేయనున్నారు. 

ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 21వ తేదీనే ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించాల్సి ఉండగా ఇప్పుడు సర్‌ గడువు పొడిగింపుతో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన ఈ నెల 31న చేయనున్నారు. ముసాయిదా బాబితాపై అభ్యంతరాలు, క్లెయిమ్‌లు సమర్పించేందుకు వచ్చే నెల 30వ తేదీ వరకు గడువు ఉంది. అభ్యంతరాలు, క్లెయిమ్స్‌ పరిష్కారం సెపె్టంబర్‌ 28కి పూర్తి చేయనున్నారు. 

అక్టోబర్‌ 3న ఓటర్ల తుది జాబితాను ప్రకటించనున్నారు. సర్‌ గడువు పొడిగింపు షెడ్యూల్‌కు విస్తృత ప్రచారం కల్పించాలని, అధికారులకు, ఉద్యోగులకు తెలియజేయడంతో పాటు రాజకీయ పార్టీలకు కూడా సవరించిన షెడ్యూల్‌ను గురించి లిఖిత పూర్వకంగా తెలిజేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి సూచించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)