Breaking News

స్మార్ట్‌రేషన్‌ కార్డు కోసం వెళ్లి వృద్ధుడు మృతి

Published on Sun, 08/31/2025 - 03:20

గోపాలపురం: కొత్త రేషన్‌ కార్డుల మంజూరులో భాగంగా టీడీపీ కూటమి ప్రభు­త్వం ఏర్పాటుచేసిన స్మార్ట్‌కార్డుల పంపి­ణీలో అపశృతి చోటు­చే­సుకుంది. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలంలోని వేళ్లచింతలగూడెం గ్రామంలో శనివారం ఉదయం నుంచి రేషన్‌ షాపు వద్ద కొత్త స్మార్ట్‌కార్డుల పంపిణీ జరుగుతుందని శుక్ర­వారం రాత్రి ప్రచారం చేశారు. దీంతో శనివారం ఉదయమే లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో క్యూ కట్టారు.

అదే గ్రామానికి చెందిన కొరపాటి పెద వెంకటస్వామి (69) కూడా క్యూలో నిలబడ్డాడు. అయితే, రెండు గంటలకు పైగా నిరీక్షించిన అనంతరం అతను కార్డు తీసుకున్నాడు. ఉదయం నుండి ఆహారం తీసుకోకపోవడంతో వెంకటస్వామి ఇంటికి చేరుకునేసరికి కళ్లు తిరిగి కింద పడిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు సపర్యలు చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో అతడు మృతిచెందినట్లు వారు తెలిపారు. 

ఇంటింటికీ పంపిణీ చేయాలి..
నిజానికి.. కొత్త స్మార్ట్‌ కార్డులను రెవెన్యూ, సచి­వాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాల్సి ఉంది. కానీ, రేషన్‌ షాపు వద్దకే రావా­లంటూ టాం టాం ద్వారా గ్రామంలో ప్రకటించడంతో లబ్ధిదారులు డీలరు వద్దకు చేరుకుని నానా అవస్థలు పడ్డారు. దీనిపై తహసీల్దార్‌ ఎంపీ సాయి­ప్రసాద్‌ను వివరణ కోరగా.. టాంటాం చేయడంవల్ల అనర్ధం జరిగిందన్నారు. స్మార్ట్‌ కార్డులు ఇంటింటికీ పంపిణీ చేయాలని ఆదేశాలు జారీచే­శామన్నారు. మరోవైపు.. ఈ ఘటనకు సంబంధించి వీఆర్వోను సస్పెండ్‌ చేసినట్లు కలెక్టర్‌ తెలిపారు.

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)