Breaking News

బాధ్యత పట్టని ఏపీ ప్రభుత్వం!

Published on Fri, 07/04/2025 - 06:04

శ్రీకాకుళం జిల్లా జి.శిగడం మండలం పాలకడియం గ్రామానికి చెందిన వెంకటేశ్‌ సిగాచీ పరిశ్రమలో సీనియర్‌ కెమిస్ట్‌.  మూడురోజుల కిందట జరిగిన పేలుడు ఘటనలో అతడు మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. అయితే రోజులు గడుస్తున్నా తన కొడుకు మృతదేహాన్ని అప్పగించని పరిస్థితి. దీంతో మృతుని తండ్రి చిన్నారావు ఆవేదనకు అంతులేదు. హెల్ప్‌డెస్క్‌ వద్ద, మార్చురీ వద్ద తమ బిడ్డ మృతదేహం కోసం పడరాని కష్టాలు పడుతున్నాడు.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: సిగాచీ పరిశ్రమ దుర్ఘటనలో మరణించిన, క్షతగాత్రులైన బిహార్, ఒడిశా కుటుంబాలకు సహాయం చేయడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నతాధికారుల బృందాలను పంపింది. కానీ ∙ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆ తరహా చొరవ చూపడం లేదు. ఈ దుర్ఘటనలో 8 మంది ఏపీ వాసులు మృత్యువాత పడ్డారు. మరో 18 మంది తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నారు. ఇతర రాష్ట్రాల అధికారులు దగ్గరుండి తమ రాష్ట్రాల బాధిత కుటుంబాలకు సహాయమందిస్తుంటే ఏపీ ప్రభుత్వం నుంచి ఇంతవరకు ఒక్క అధికారి కూడా అటువైపు తొంగిచూడలేదు. దీనిపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

 రోజుల తరబడి నిరీక్షణ
ఏపీకి చెందిన మృతుల్లో విజయనగరం, కృష్ణా, ప్రకాశం, వైఎస్సార్, తూర్పుగోదావరి తదితర జిల్లాలకు చెందిన వారున్నారు. అయితే గుర్తుపట్టలేనంతగా కాలిపోవడంతో మృతదేహాల అప్పగింత ప్రహసనంగా మారింది. డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించి మృతదేహాలను అప్పగిస్తున్నారు. ఈ క్రమంలో మృతదేహాలు ఇంకా అందక ఆయా కుటుంబాలు పాశమైలారం పారిశ్రామిక వాడలో నరకయాతన అనుభవిస్తున్నారు. తమ వారిని కోల్పోయిన దుఖం కంటే.. కడసారి చూపు కోసం వారు పడుతున్న బాధ వర్ణణాతీతం. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్ద బాధిత కుటుంబాలు కన్నీరు ఇంకిన కళ్లతో వేచి చూస్తున్నాయి. బిహార్, ఒడిశా రాష్ట్రాల మాదిరిగా తమకు సహాయం అందించేందుకు తమ అధికారులెవరూ రాలేదని వాపోతున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)