Breaking News

ఏడు రోజుల్లో పరిష్కరించాలి

Published on Sat, 12/16/2023 - 05:18

సాక్షి, అమరావతి: కార్పొరేట్‌కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను అన్ని మౌలిక సదుపాయాలతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని అదే ప్రమాణాలతో నిరంతరం నాణ్యతగా నిర్వహించడంపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. మన బడి నాడు – నేడు తొలి దశ పనులు పూర్తైన పాఠశాలల్లో మరమ్మతులు, నిర్వహణపై దృష్టి పెట్టి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా విద్యా శాఖ అధికారులు, ప్రాజెక్టు కో–ఆర్డినేటర్లకు పాఠశాల విద్య (మౌలిక సదుపాయాలు) కమిషనర్‌ కె.భాస్కర్‌ సూచించారు. నాడు–నేడు తొలి దశ స్కూళ్ల నిర్వహణకు సంబంధించిన మార్గ­దర్శకాలను ఆయన జారీ చేశారు.

మరమ్మతులు, నిర్వహణ సమస్యలపై ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు వారంటీ సంస్థలకు వెంటనే సమాచా­రం ఇవ్వాలన్నారు. మరమ్మతులు, నిర్వహణ సమస్యలను ఏడు రోజుల్లోగా ఆయా సంస్థలు పరిష్కరించాలన్నారు. ఈమేరకు ఈ నెల 21వ తేదీలోగా సమగ్ర నిర్వహణ, మరమ్మతుల పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. బాలికలు, బాలురుకు వేర్వేరు టాయిలెట్లలో నిరంతరం నీటి సరఫరా ఉండాలని, ఇందులో ఏమైనా సమస్యలుంటే పరిష్కరించే బాధ్యత ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులదేనని స్పష్టం చేశారు.

తొలి దశలో సృష్టించిన అన్ని ఆస్తుల నిర్వహణ సజావుగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత ప్రధానోపాధ్యాయులతో పాటు జిల్లా విద్యా శాఖ అధికారులు, ప్రాజెక్టు అదనపు కో–ఆర్డినేటర్లదేనని పేర్కొన్నారు. గ్రీన్‌ చాక్‌ బోర్డులు, ఐఎఫ్‌పీలలో సమస్యలు తలెత్తితే ఏడు రోజుల్లోగా మరమ్మతులు చేయించాలని సూచించారు. టాయిలెట్లలో అన్నీ సక్రమంగా పని చేస్తున్నాయో లేదో పరిశీలించి అవసరమైతే మరమ్మతులు లేదా రీప్లేస్‌మెంట్‌ కోసం చర్యలు తీసుకోవాలని సూచించారు. తరగతి గదుల్లో తలుపులు, కిటికీలు, సీలింగ్, అల్మారాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అవసరమైన చోట మరమ్మతులు చేపట్టాలన్నారు.

తాగునీటి వ్యవస్థలు సక్రమంగా పని చేస్తున్నాయా లేదా అనేది నిర్ధారించుకుంటూ ప్రమాణాలకు అనుగుణంగా రక్షిత మంచినీటిని క్రమం తప్పకుండా పరీక్షించాలన్నారు. తాగునీటి సరఫరాలో అంతరాయాలు లేకుండా పర్యవేక్షిస్తూ బ్యాటరీ, పంపులు, వాటర్‌ పైపుల మరమ్మతులతోపాటు అవసరమైన చోట ఫిల్టర్లను రీప్లేస్‌మెంట్‌ చేయాలన్నారు. ఫ్యాన్లు, ట్యూబ్‌ లైట్లు సరిగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని సూచించారు. స్కూళ్ల ఆవరణలో పెయింటింగ్‌ సరిగా లేకుంటే ఆయా సంస్థలకు తెలియచేసి రంగులు వేయించాలన్నారు. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచాలని స్పష్టం చేశారు.  

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)