Breaking News

టెన్త్‌ విద్యార్థుల వివరాల సవరణకు ఎడిట్‌ ఆప్షన్‌

Published on Wed, 01/11/2023 - 04:59

సాక్షి, అమరావతి: పదో తరగతి ధ్రువపత్రాల్లో తలెత్తే లోపాలు విద్యార్థులకు ఆ తరువాతి కాలంలో పెద్ద సమస్యగా, ఇబ్బందికరంగా మారుతుంటాయి. చివరి నిమిషంలో వాటిని సరిచేయించేందుకు విద్యార్థులు, తల్లిదండ్రులు నానా అవస్థలు పడుతుంటారు. టెన్త్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు సంబంధించిన నామినల్‌ రోల్స్‌లో వారి వివరాలను సరైన రీతిలో పొందుపరచకపోతే అవే పొరపాట్లు ధ్రువపత్రాల్లో నమోదవుతుంటాయి. ఈ సమస్యలకు ముందుగానే చెక్‌పెట్టేలా ఎస్సెస్సీ బోర్డు తాజాగా ఎడిట్‌ ఆప్షన్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తెచ్చింది.

ఆయా పాఠశాలల హెడ్మాస్టర్లు తమ స్కూలు ద్వారా టెన్త్‌ పరీక్షలకు హాజ­రయ్యే విద్యార్థుల వివరాలను సరిచూసుకుని పొరపా­ట్లు లేకుండా సవరించుకునేందుకు ఈ ఎడిట్‌ ఆప్షన్‌­ను అందుబాటులోకి తెచ్చామని ప్రభు­త్వ ప­రీ­క్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలి­పారు. స్కూల్‌ లాగిన్‌ నుంచి ఈ ఎడిట్‌ ఆప్ష­న్‌ విని­యోగించి నామినల్‌ రోల్స్‌లోని వివరాల­ను సరి­చేసుకోవాలని సూచించారు. బుధవారం (నేడు) నుంచి ఈనెల 20వ తేదీవరకు ఈ ఎడిట్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఆలో­గా వివరాలు సరిచూసుకోవాలని ఆయన కోరారు. 

సరిచూసుకోవలసిన అంశాలు
► విద్యార్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరు
► పుట్టిన తేదీ
► విద్యార్థి ఎంచుకున్న ఫస్ట్‌ లాంగ్వేజ్, సెకండ్‌ లాంగ్వేజ్‌ కాంబినేషన్‌
► విద్యార్థి ఎంపిక చేసుకున్న మాధ్యమం
► ఓఎస్సెస్సీ సబ్జెక్టు కోడ్‌
► వొకేషనల్‌ ఎస్సెస్సీ సబ్జెక్టు, కోడ్‌
► విద్యార్థి ఐడెంటిఫికేషన్‌ చిహ్నాలు (పుట్టుమచ్చలు)
► విద్యార్థి ఫొటో, సంతకం

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)