Breaking News

సత్తా చాటిన నౌకాదళం

Published on Sun, 01/05/2025 - 05:25

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: విశాఖ ఆర్‌కె బీచ్‌ వేదికగా తూర్పు నౌకాదళం సత్తా చాటింది. శనివారం సాయంత్రం బీచ్‌ వద్ద నౌకాదళం చేసిన విన్యాసాలు నౌకా దళం పటిష్టతను, ప్రతిభా పాటవాలను చాటి చెప్పాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజర­య్యారు. గంటన్నర పాటు భారత నావికా దళ సంపత్తిని ప్రస్ఫుటం చేస్తూ యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, నౌకలు చేసిన యుద్ధ విన్యాసాలు అందరినీ అబ్బురపరిచాయి.

నౌకాదళం, మెరైన్‌ కమాండోలు ఒళ్లు గగుర్పొడిచేలా సాహసోపేత­మైన విన్యాసాలు చేశారు. యుద్ధ సమయంలో నేవీ కమాండ్‌ స్పందించే విధానం చూపరుల్ని ఆకట్టు­కుంది. ఆయిల్‌ రిగ్‌ను పేల్చివేయడం, 8 వేల అడుగుల నుంచి పారాచూట్‌లతో నిర్దేశిత ప్రాంతంలో మెరైన్‌ కమాండోలు దిగడం వంటివి ఆకట్టుకున్నాయి. 

డార్నియర్‌ హెలికాప్టర్, హాక్‌ జెట్‌ ఫైటర్లు, నౌకలపై నుంచి జరిపే ఫైరింగ్‌తో పాటు దేశీయంగా అభివృధ్ధి చేసిన హెలికాప్టర్ల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమం చివరలో నిర్వహించిన లేజర్, డ్రోన్‌ షో విశేషంగా ఆకట్టుకుంది. సముద్రంలో లంగరు వేసిన యుద్ధ నౌకలు విద్యుత్‌ కాంతులతో అందరినీ ఆకట్టుకున్నాయి. 

8న పీఎంచే రైల్వే జోన్‌కు శంకుస్థాపన: చంద్రబాబు
నావికాదళం ధైర్యం, సామర్థ్యాలను, దక్షతకు నిదర్శనంగా ఈ విన్యాసాలు నిలిచాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఈ నెల 8న దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ రైల్వేజోన్‌కి శంకుస్థాపన చేస్తారని ప్రకటించారు. ఎన్‌టీపీసీ–జెన్‌కో సంయుక్తంగా దేశంలోని తొలి భారీ గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టుకు కూడా శంకుస్థాపన చేయనున్నట్టు తెలిపారు. 

విశాఖలో త్వరలో టీసీఎస్‌ ఏర్పాటు కానుందని, గూగుల్‌  డేటా సెంటర్‌ ఏర్పాటుకు అవగాహన ఒప్పందం (ఎంవోయు) కుదుర్చుకుందని తెలిపారు. ఈ ఏడాదిలోనే అనకాపల్లికి గోదావరి నీళ్లు వస్తాయని, వచ్చే సంవత్సరం విశాఖకు గోదావరి జలాలు అందిస్తామని తెలిపారు.

నేవీకి నగర ప్రజల సహకారం మరువలేనిది: తూర్పు నావికా దళాధిపతి
ఎటువంటి సవాళ్లనైనా, ఎప్పుడైనా, ఎక్క­డైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని తూర్పు నావికా దళాధిపతి వైస్‌ అడ్మిరల్‌ రాజేష్‌ పెంధార్కర్‌ చెప్పారు. విశాఖ వేది­కగా గతంలో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ కార్య­క్రమాలను విజయవంతంగా నిర్వహించా­మని తెలిపారు. సామాజిక సేవ, పర్యావ­రణ కార్యక్రమాలలో తూర్పు నావికాదళం భాగ­మ­వుతోందని అన్నారు. 

ఇటీవల నిర్వ­హించిన నేవీ మారథాన్‌లో 14 వేల మందికి పైగా ప్రజలు, 9 దేశాలకు చెందిన వారు పాల్గొని అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చా­రని చెప్పా­రు. తూర్పు నావికాదళానికి విశా­ఖ ప్రజలు అందిస్తున్న సహాయ సహకా­రాలు మరు­వలేనివని అన్నారు. ఈ కార్యక్ర­మంలో ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్‌తో పాటు మంత్రులు, అధికా­రులు, సీఎం చంద్రబాబు సతీమణి భువనే­శ్వ­రి, తదితరులు హాజర­య్యా­రు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)