Breaking News

ఒంగోలులో భూ ప్రకంపనలు

Published on Wed, 09/24/2025 - 08:51

సాక్షి, ఒంగోలు: ఒంగోలు(Ongole)లో భూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. మంగళవారం అర్ధరాత్రి లాయర్‌పేట, శర్మ కాలేజీ పరిసర ప్రాంతాల్లో స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రకంపనల కారణంగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.

వివరాల ప్రకారం.. ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా భూమి కంపించింది. రాత్రి రెండు గంటల సమయంలో 2 సెకన్ల పాటు భూమి కంపించినట్టు స్థానికులు చెబుతున్నారు.. ఒంగోలులోని సీఎస్ఆర్ శర్మ కాలేజీ ప్రాంతంలో భూమి అత్యధికంగా కనిపించినట్లు స్థానికులు తెలిపారు.. అయితే, రాత్రి సమయం కావటంతో స్థానికులు గుర్తించేలోపే భూ ప్రకంపనల తీవ్రత తగ్గినట్టుగా తెలుస్తోంది. కొందరు మాత్రం ప్రకంపనల కారణంగా భయంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చారు. 

ఇక, దీనిపై సమాచారం అందుకున్న అధికారులు.. స్థానిక ప్రజల నుంచి పూర్తి వివరాలను సేకరిస్తున్నారు.. కాగా, ప్రకాశం జిల్లాలో గతంలోనూ భూ ప్రకంపనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. ఈ ఏడాది మే నెలలో ఓసారి.. గత ఏడాది డిసెంబర్‌లోనూ ఓసారి ప్రకాశం జిల్లా ప్రజలను భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి.. అయితే, తాజాగా సంభవించిన భూప్రకంపనలపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)