Breaking News

డ్వాక్రా మహిళలపై సర్కారు కత్తి

Published on Thu, 05/29/2025 - 02:02

సాక్షి, రాయచోటి : కడపలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు చివరిరోజు బహిరంగ సభకు జనాలను తరలించేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. టీడీపీ కేడర్‌లో అసంతృప్తి, ప్రజలకు ఏడాది కాలంలో ఏమీ చేయలేకపోవడం, సర్కారుపై తీవ్ర వ్యతిరేకత కారణంగా జనం వచ్చే పరిస్థితి కనిపించకపోవడంతో డ్వాక్రా మహిళలను తరలించేందుకు అల్టిమేటం జారీచేశారు. సభకు వస్తే ఉంటారు, లేకపోతే ఇబ్బందులు తప్పవనే తరహాలో బెదిరిస్తున్నారు. 

ఆబ్సెంట్‌ అయితే పనిష్మెంట్‌..
అలాగే, రాయలసీమ జిల్లాలోని స్వయం సహాయక సభ్యులందరూ కచ్చితంగా పాల్గొనాలని పెట్టిన వాయిస్‌ మెసేజ్‌ కలకలం రేపుతోంది. ప్రతి గ్రూపులోనూ కనీసం ఏడుగురు వచ్చేలా చూసుకోవాలని డ్వాక్రా లీడర్లకు స్పష్టంగా చెప్పడంతో పాటు ఎవరైనా రాని పక్షంలో వారి స్థానంలో మరో మహిళను కూలీ ఇచ్చి తీసుకురావాలని అల్టిమేటం జారీచేశారు. అంతేకాదు.. మహానాడు చివరిరోజు నిర్వహిస్తున్న బహిరంగసభకు గైర్హాజరైతే కచ్చితంగా పనిష్మెంట్‌ ఉంటుందని హెచ్చరించారు. డ్వాక్రా మహిళల మెడపై ఇలా కత్తిపెట్టి తరలిస్తుండటంపై అన్నిచోట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఇద్దరు యానిమేటర్లకు ఒక బస్సు..
డ్వాక్రా మహిళలను తరలించే బాధ్యత యానిమేటర్లకు అప్పగించారు. ఒక యాని­మేటర్‌ పరిధిలో పదుల సంఖ్యలో గ్రూపులు ఉంటాయి కాబట్టి ఇద్దరు యానిమే­టర్లకు కలిపి ఒక బస్సును కేటాయించి, అందులో మహిళలను తరలించేలా ప్రణాళిక రూపొందించారు. 

పెద్దఎత్తున మహిళలను తరలించే బాధ్యత యానిమేటర్లదే­నని, ఎవరు ఇందులో ఫెయిలైనా తమ వారిని యానిమే­టర్లుగా పెట్టుకుంటామని పార్టీ నేతలు ఇప్పటికే మౌఖికంగా బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. పైగా.. ఎవరు వచ్చారు? ఎవరు రాలేదన్న విషయంలో గ్రూపు సభ్యులు మహానాడు వద్ద సెల్ఫీ తీసుకుని పెట్టాలని చెప్పడంపై మహిళా సంఘాలు  రగిలిపోతు­న్నాయి. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)