మహాలక్ష్మీదేవిగా దుర్గమ్మ

Published on Wed, 10/09/2024 - 05:15

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలు అంగరంగ వైభవంగా జరుగు­తున్నాయి. ఆరో రోజు మంగళవారం మహాలక్ష్మిదేవిగా దుర్గమ్మ దర్శనమిచ్చారు. సాయంత్రం నగరోత్సవం కనులపండువగా సాగింది. కనకదుర్గానగర్‌లో కళావేదికపై ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు ఆకట్టుకున్నాయి. 

బుధవారం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీ దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు మంగళవారం రాత్రి 11 గంటల నుంచే ఇంద్రకీలాద్రిపైకి భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. మూలా నక్షత్రం నాడు 2 లక్షల మందికిపైగా భక్తులు రానున్న నేపథ్యంలో అందుకు తగినట్లు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేపట్టింది. 

క్యూలైన్లలో మార్పులు చేసింది. వీఐపీ దర్శనాలనూ రద్దు చేసింది. బుధవారం తెల్లవారుజామున 2.00 గంటల నంచి రాత్రి 11 గంటల వరకు భక్తులందరికీ ఉచితంగా అమ్మవారి దర్శనాన్ని కల్పిస్తోంది. ఫ్లైవోవర్‌ కింద వాహనాలకు అనుమతి రద్దు చేసింది. సీఎం చంద్రబాబు బుధవారం అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు.

నేడు శ్రీ సరస్వతిదేవిగా... 
ఇంద్రకీలాద్రిపై నిర్వహిస్తున్న దసరా ఉత్సవా­ల్లో భా­గంగా అమ్మవారు బుధవారం శ్రీ సరస్వతిదేవి­గా భక్తులకు దర్శనమివ్వనున్నారు. మూలా నక్షత్రం అమ్మవారి జన్మనక్షత్రం. ఈ రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ అవతారంలో భక్తులను అమ్మవారు అనుగ్రహిస్తారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)