Breaking News

అందుబాటులో దుర్గమ్మ దసరా ఆర్జిత సేవా టికెట్లు

Published on Fri, 09/13/2024 - 05:15

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ ఇంద్రకీలాద్రిపై వచ్చే నెల 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్న దసరా ఉత్సవాల్లో ప్రత్యేక ఆర్జిత సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో వచ్చాయి. దసరా ఉత్సవాల్లో అమ్మవారికి ప్రత్యేకంగా ఖడ్గమాలార్చన, కుంకుమార్చన, శ్రీచక్రనవార్చన,  చండీహోమాలను నిర్వహిస్తారు. 

ఆయా టికెట్ల ధరలను దేవస్థానం ఖరారు చేయగా, ఆన్‌లైన్‌తో పాటు దేవస్థానం ఆవరణలోని టికెట్‌ కౌంటర్, మహామండపం దిగువన టోల్‌ఫ్రీ నంబర్‌ కౌంటర్‌లో టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేక ఖడ్గమాలార్చనకు రూ. 5,116, ప్రత్యేక కుంకుమార్చనకు రూ. 3 వేలుగా నిర్ణయించారు. మూలా నక్షత్రం రోజున నిర్వహించే ప్రత్యేక కుంకుమార్చన టికెట్‌ ధర రూ. 5 వేలు. 

ఇక ప్రత్యేక శ్రీచక్రనవార్చనకు టికెట్‌ ధర రూ. 3 వేలు,  ప్రత్యేక చండీహోమం టికెట్‌ ధర రూ. 4 వేలుగా నిర్ణయించారు. ఇక ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వహించే వేద విద్వత్‌ సభ అక్టోబర్‌ 10న, అర్చన సభ 11న నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. దసరా ఉత్సవాల నేపథ్యంలో అమ్మవారికి విశేష అలంకారాలు, ప్రత్యేక పూజలు, నివేదనలు, వేద సభ, అర్చక సత్కారం వంటి వైదిక కార్యక్రమాలపై వైదిక కమిటీ సభ్యులతో ఈవో రామారావు గురువారం సమావేశం నిర్వహించారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)