Breaking News

గన్నవరంపై పొగమంచు ఎఫెక్ట్‌.. విమానం దారి మళ్లింపు

Published on Fri, 01/24/2025 - 08:45

సాక్షి, కృష్ణా: తెలుగు రాష్ట్రాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. పొగమంచు కారణంగా విమానాలు, వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. తాజాగా గన్నవరం(Gannavaram) విమానాశ్రయంలో దట్టమైన పొగమంచు కారణంగా విమాన ల్యాండింగ్‌కు అంతరాయం తగిలింది. వాతావరణం అనుకూలించకపోవడంతో విమానాన్ని రాజమండ్రికి తరలించారు.

గన్నవరం విమానాశ్రయంలో శుక్రవారం తెల్లవారుజామున దట్టమైన పొగమంచు కమ్ముకుంది. పొగమంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కి అంతరాయం ఏర్పడింది. దీంతో, హైదరాబాద్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానం కొద్దిసేపు గాల్లో చక్కర్లు కొట్టింది. అయినప్పటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో అధికారులు విమానాన్ని దారి మళ్లించారు. ఈ క్రమంలో విమానాన్ని రాజమండ్రికి మళ్లించారు.

ఇదిలా ఉండగా.. తెలంగాణలో సైతం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హైదరాబాద్‌(Hyderabad), ఆదిలాబాద్‌, నల్లగొండ జిల్లాల్లో దట్టమైన పొగమంచు కురుస్తోంది. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నల్లగొండ జిల్లాలోని నకిరేకల్ వద్ద జాతీయ రహదారిని పొగ మంచు కమ్మేసింది. లైట్ల వెలుతురుతో నెమ్మదిగా వాహనాలు ముందుకు సాగుతున్నాయి. ఇక, యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట ఆలయం వద్ద కూడా దట్టంగా పొగమంచు అలుముకుంది. ప్రధాన ఆలయంతో పాటు ఘాట్‌రోడ్‌ ప్రాంతాల్లో మంచు విపరీతంగా కురుస్తోంది. పొగ మంచులో ఆలయ పరిసరాలు మరింత శోభను సంతరించుకున్నాయి.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)