Breaking News

అచ్చెన్నకు ఎమోషన్‌.. అన్నయ్యకు ప్రమోషన్‌

Published on Thu, 08/29/2024 - 05:45

సాక్షి, అమరావతి: ‘‘అన్నయ్య సన్నిధి.. అదే నాకు పెన్నిధి’’ అని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు రాగాలు ఆలపిస్తుంటే.. ఆ ఎమోషన్‌కు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఆ అన్నయ్యకు ప్రమోషన్‌ ఇచ్చేందుకు ఆగమేఘాలపై ఫైళ్లు కదుపుతున్నారు. అచ్చెన్న అన్నయ్య కింజరాపు ప్రభాకర్‌ నాయుడు ప్రస్తుతం విశాఖపట్నంలో స్పెషల్‌ బ్రాంచ్‌(ఎస్‌బీ) డీఎస్పీగా ఉన్నారు. ఆయన ఈ నెల 31న రిటైర్‌ కానున్నారు. అంతలోగానే ఆయనకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. 

ఆర్థిక శాఖ అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ మరీ మంత్రిగారి అన్నయ్యకు ‘రిటైర్మెంట్‌ గిఫ్ట్‌’ ఇచ్చేందుకు సన్నద్ధమవుతోంది.  రాష్ట్రంలో అదనపు ఎస్పీ పోస్టులకు 30 మంది డీఎస్పీలు అర్హులుగా ఉన్నారు. వారి పదోన్నతుల కోసం పాటించాల్సిన ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మొత్తం పోలీసు శాఖలో అన్ని స్థాయిల్లోనూ పదోన్నతులపై విధాన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కాబట్టి ప్రస్తుతం ఆ 30 మందికి పదోన్నతులు కల్పించడానికి అనుమతించలేమని ఆర్థికశాఖ తేల్చిచెప్పింది. 

ప్రస్తుతం అవసరం లేకున్నా సరే పదోన్నతులు కల్పిస్తే ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, ఇతర అలవెన్స్‌ల రూపంలో ప్రభుత్వంపై అనవసర ఆర్థిక భారం పడుతుందని కూడా పేర్కొంది. కానీ మంత్రి అచ్చెన్నాయుడు.. అటు పోలీసు శాఖ ఇటు ఆర్థిక శాఖపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చినట్టు తెలుస్తోంది. రిటైరయ్యేలోగా తన అన్నయ్యకు అదనపు ఎస్పీగా పదోన్నతి కల్పించాల్సి0దేనని పట్టుబట్టారు. దాంతో అదనపు ఎస్పీల పద్నోనతుల జాబితాను 22 మందికి పరిమితం చేస్తూ మరో జాబితాను రూపొందించారు. కొత్త జాబితాలో 22వ పేరు కింజరాపు ప్రభాకర్‌దే కావడం గమనార్హం. 

ఆర్థిక శాఖ ఆమోదం తరువాత చూసుకుందాం.. ముందు ఆ జాబితాలోని వారికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని పోలీసు శాఖ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందుకు ప్రభుత్వ పెద్దలు పచ్చ జెండా కూడా ఊపారు. దాంతో ఒకటి రెండు రోజుల్లోనే కింజరాపు ప్రభాకర్‌తో సహా ఆ జాబితాలోని 22 మందికి అదనపు ఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ కానున్నాయని పోలీసు శాఖ వర్గాలు చెబుతున్నాయి.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)