Breaking News

కొత్త టీచర్లకు టోకరా!

Published on Mon, 10/13/2025 - 04:59

సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం డీఎస్సీ–2025 ని­ర్వహణలోనే కాదు.. ఎంపికైన  అభ్యర్థులకు పోస్టింగ్స్‌ ఇవ్వ­డంలోనూ ఎక్కడలేని గందరగోళం సృష్టిస్తోంది. స్కూళ్ల ఎంపి­క­లో అభ్యర్థులు ఆప్షన్స్‌ పెట్టే సమయంలోనూ వారిని త­ప్పు­దారి పట్టించింది. దీంతో చాలామందికి క్లస్టర్‌ కాంప్లె­క్స్‌లో పోస్టింగ్స్‌ వచ్చాయి. మరోపక్క.. చాలామంది అభ్య­ర్థులకు ఏ స్కూ­లూ కేటాయించకుండానే జాయినింగ్‌ రిపో­ర్టు­లు జారీచే­యడంపై విస్మయం వ్యక్తమవుతోంది. పైగా.. కొ­త్త టీచర్లు అందరూ సోమవారం వారికి కేటాయించిన స్కూ­ళ్లల్లో రిపోర్టు చేయాలని, వెంటనే విధుల్లో చేరాలని వి­ద్యాశాఖ ఆదేశించింది. అయితే, ఏ స్కూలూ కేటాయించని తా­ము ఎక్కడ రిపోర్టు చేయాలో అర్ధంగాక అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. 

కస్టర్లలో పోస్టింగ్‌లు..
డీఎస్సీ–2025 ద్వారా ఎంపికైన టీచర్లకుఈనెల 3 నుంచి శిక్షణ ఇస్తున్నారు. ఆయా కేంద్రాల్లోనే పోస్టింగ్స్‌ కోసం వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేందుకు అనుమతించారు. దీంతో అభ్యర్థులు మండలాల వారీగా ఉన్న స్కూళ్లను ఎంచుకున్నారు. కానీ, చాలామంది అభ్యర్థులకు క్లస్టర్లలో పోస్టింగ్స్‌ వచ్చాయి. దీంతో వీరు మొదటి నుంచే మిగులు ఉపాధ్యాయులుగా మారినట్లైంది. 

ఆప్షన్ల సమయంలో సర్కారు దొంగాట..
మరోవైపు.. పాఠశాల విద్యాశాఖ మేలో చేపట్టిన ఉపాధ్యాయుల సాధారణ బదిలీల్లో దాదాపు ఐదువేల మంది స్కూల్‌ అసిస్టెంట్లు మిగులుగా తేలారు. వీరందరినీ డీఈఓ పూల్, క్లస్టర్‌ పూల్‌లో ఉంచారు. స్కూళ్లు కేటాయించకుండా ఉపాధ్యాయులను సర్‌ప్లస్‌ చేయడంపై అప్పట్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో.. డీఈఓ పూల్‌లో ఉన్న టీచర్లను సర్దుబాటు చేసి, క్లస్టర్‌ పూల్‌లో ఉన్నవారిని అలాగే ఉంచారు.

ఇలా ఐదు నెలలుగా వీరికి స్థానాలు కేటాయించలేదు. తాజా డీఎస్సీ–2025లో ప్రకటించిన పోస్టుల్లో 7,725 స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టులే. ఇప్పుడు కొత్తగా స్కూల్‌ అసిస్టెంట్లుగా ఎంపికైన అత్యధికులను కూడా క్లస్టర్‌ కాంప్లెక్స్‌ల్లో వేసినట్లు తెలిసింది. రెగ్యులర్‌ ఉపాధ్యాయులు సెలవుల్లో వెళ్లినప్పుడు ఆ సమయంలో వీరి సేవలను ఉపయోగించుకుంటారు. అయితే, ఆప్షన్లు ఇచ్చుకునే సమయంలోనే కొత్త టీచర్లను సర్కారు తికమకకు గురిచేసి దొంగాట ఆడినట్లు తెలుస్తోంది. 

ఎక్కడ రిపోర్టు చేయాలో?
ఇదిలా ఉంటే.. జాయినింగ్‌ ఆర్డర్‌ అందిన అభ్యర్థులు సోమవారం తమకు కేటాయించిన స్థానాల్లో రిపోర్టు చేయాలని అధికారులు ఆదేశించారు. కొందరు అభ్యర్థులకు స్థానాలు చూపకపోవడంతో  ఎక్కడ రిపోర్టు చేయాలో తెలీక వారు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలా కొత్త టీచర్లలోని కొందరిని రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్లలో మిగులు ఉపాధ్యా­యులుగా మారిస్తే మరికొందరిని ఎటూగాకుండా చేసింది.

రూ.50 వేల బాండ్‌ ఇవ్వాలంట..
ఇదిలా ఉంటే.. సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల్లో ని­య­మితులైన కొత్త టీచర్లు రూ.50 వేల పూచీకత్తుతో బాండ్‌­ను సమర్పించాలని నిబంధన విధించారు. అంతే­గాక.. కనీసం ఐదేళ్లు సొసైటీలో పనిచేస్తామని హామీ ఇవ్వా­లని పేర్కొనడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ప్రైవేటు, కార్పొరేటు కంపెనీలు విధించే నిబంధనలను టీడీపీ కూటమి ప్రభుత్వం పెట్టడంపై వారు దుమ్మెత్తిపోస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)