Breaking News

తుది దశకు డ్రోన్‌ సర్వే

Published on Sat, 10/21/2023 - 05:04

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న భూముల రీ సర్వేలో కీలకమైన డ్రోన్‌ సర్వే (డ్రోన్లతో భూముల కొలత) తుది దశకు చేరుకుంది. ఇప్పటి వరకు 97 శాతం సర్వే పూర్తయింది. మిగిలిన 3 శాతాన్ని ఈ నెలాఖరుకు పూర్తి చేయడానికి సర్వే, సెటిల్‌మెంట్‌ శాఖ ప్రయత్నాలు చేస్తోంది.

రాష్ట్రంలోని 17,595 గ్రామాలకు గాను, డ్రోన్‌ సర్వే సాధ్యం కాని 4,135 గ్రామాలను మినహాయిస్తే 13,460 గ్రామాల్లో సర్వే చేపట్టారు. ఈ గ్రామాల్లో డ్రోన్లు, విమానాల ద్వారా సర్వే చేస్తున్నారు. ఇప్పటివరకు 13,075 గ్రామాల్లో దాదాపు 1.75 కోట్ల ఎకరాల్లో సర్వే పూర్తయింది. ఇంకా కేవలం 385 గ్రామాల్లో మాత్రమే సర్వే పూర్తి కావాల్సి ఉంది. వీటిలో శ్రీకాకుళం, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లోని ఎక్కువ గ్రామాల్లో సర్వే జరగాల్సి ఉంది. ఈ నెలాఖరుకు మొత్తం గ్రామాల్లో సర్వే పూర్తవుతుందని సర్వే శాఖ అధికారులంటున్నారు.  ఇది పూర్తయితే రీ సర్వేలో అతి ముఖ్యమైన ఘట్టాన్ని పూర్తి చేసినట్లవుతుంది.  మొత్తం 1.80 కోట్ల ఎకరాలను కొలిచినట్లవుతుంది. ఇది ఒక రికార్డుగా అధికారులు చెబుతున్నారు. 

వేగంగా పూర్తి చేసేందుకు... 
వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పేరుతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ఏరియల్‌ సర్వే కోసం డ్రోన్లతోపాటు విమానాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. సర్వే ఆఫ్‌ ఇండియాతోపాటు ప్రైవేట్‌ డ్రోన్‌ ఏజెన్సీలకు ఈ బాధ్యతను అప్పగించింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం 10 వేలమంది సర్వేయర్లను నియమించడంతోపాటు సొంతంగా 30 డ్రోన్లు కొనుగోలు చేసి సర్వేయర్లకు పైలెట్లుగా శిక్షణ ఇచ్చి సర్వే చేయిస్తోంది. దీంతో సర్వే అత్యంత వేగంగా పూర్తవుతోంది.

Videos

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)