సూక్ష్మ సేద్యం సబ్సిడీలు ఖరారు

Published on Tue, 02/18/2025 - 03:16

సాక్షి, అమరావతి: కేంద్ర రాష్ట్రీయ కృషి వికాస యోజన (ఆర్‌కేవీవై)–పెర్‌ డ్రాప్‌ మోర్‌ క్రాప్‌ (పీడీఎంసీ) స్కీమ్‌లో భాగంగా అమలు చేస్తోన్న సూక్ష్మ సాగునీటి పథకం కింద బిందు, తుంపర పరికరాలను అమర్చేందుకు 2025–26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి సబ్సిడీలు ఖరార­య్యాయి. ఈ మేరకు సోమవారం  వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ బుడితి రాజశేఖర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  

⇒  రాష్ట్ర వ్యాప్తంగా ఐదెకరాల్లోపు ఎస్సీ, ఎస్టీ సన్న, చిన్నకారు రైతులకు 100 శాతం సబ్సిడీపై పరికరాలు ఇవ్వనున్నారు. 
⇒ ఎస్సీ, ఎస్టీ యేతర సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీ (గరిష్టంగా రూ.2.18 లక్షలు) ఉంటుంది. 
⇒ రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో 5–10 ఎకరా­ల్లోపు రైతులతో పాటు గిరిజన ప్రాంతాల్లో ఎస్టీ రైతులకు 90 శాతం సబ్సిడీ (రూ.3.14 లక్షలు) ఇవ్వనున్నారు.

⇒ కోస్తా జిల్లాల్లో 5–10 ఎకరాల్లోపు రైతులకు 70 శాతం (రూ.3.10 లక్ష­లు), 10 ఎకరాలకు పైబ­డిన రైతులకు 50 శాతం (రూ.4లక్షలు) చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు.
⇒ఇక తుంపర పరికరాల కోసం దరఖాస్తు చేసే అన్ని సామాజిక వర్గాలకు చెందిన ఐదెకరా­ల్లోపు సన్న, చిన్నకారు రైతులకు 50 శాతం (రూ.19వేలు), 12.5 ఎకరాల్లోపు భూమి కలిగిన ఇతర సామాజిక వర్గాలకు చెందిన రైతులకు కూడా 50 శాతం (రూ.19వేలు) చొప్పున సబ్సిడీ ఇవ్వనున్నారు. 

వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అమలు చేసినట్లుగానే...
కాగా, 2024–25 సీజన్‌ వరకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం నిర్ధేశించిన సబ్సిడీల మేరకే బిందు, తుంపర పరికరాలు ఇస్తున్నారు. రూ.2,700 కోట్లతో 7.50 లక్షల ఎకరాల్లో  సూక్ష్మ సేద్యం  విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించగా, 7.95 లక్షల ఎకరాల్లో విస్తరణకు రైతులు తమ వివరాలను నమోదు చేసుకున్నారు.  అయితే ఇప్పటి వరకు కేవలం లక్ష ఎకరాల్లో బిందు పరికరాల అమరికకు పరిపాలనా ఉత్తర్వులిచ్చారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)