Breaking News

ప్రత్యక్ష నరకం!

Published on Sun, 10/26/2025 - 05:31

కర్నూలు (హాస్పిటల్‌): ‘ఎవరి శరీరానికైనా కొంచెం నిప్పు తగిలితే సుర్రుమంటుంది. కానీ అత్యధిక వేడితో శరీరం కాలిపోతున్నా వారికి తెలియలేదంటే పరిస్థితి ఎంతటి భయానకంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బస్సు మంటల్లో కాలిపోతున్నప్పుడు వెలువడిన విష వాయువులు పీల్చడం వల్ల అందులో ప్రయాణిస్తున్న వారు స్పృహ కోల్పోయారు. ఇదే సమయంలో మంటలు వారిని దహించేసి ఉంటాయి’ అని కర్నూలు మెడికల్‌ కాలేజ్‌ ఫోరెన్సిక్‌ విభాగాధిపతి డాక్టర్‌ టి.సాయిసుదీర్‌ వెల్లడించారు. 

కర్నూలు శివారులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మంటల్లో కాలిపోయి మరణించిన విషయం తెలిసిందే. కాళ్లు, చేతులు బూడిదైపోగా.. మిగిలిన మొండేల నుంచి డీఎన్‌ఏ పరీక్ష కోసం శాంపిల్స్‌ సేకరించారు. శనివారం వరకు 18 మంది మృతుల కుటుంబీకుల నుంచి రక్త నమూనాలు సేకరించారు. వీటిని మంగళగిరిలోని ఫోరెన్సిక్‌ సైన్స్‌ లేబోరేటరీకి పంపించారు. 

రెండు రోజుల్లో నివేదికలు రానున్నాయి. మరో గుర్తు తెలియని వ్యక్తి కుటుంబీకుల కోసం ఎదురు చూస్తున్నా­రు. ఈ నేపథ్యంలో ప్ర­మాదం జరిగిన బస్సును సునిశితంగా పరిశీలించిన డాక్టర్‌ సాయిసు«దీర్‌ శనివారం ‘సాక్షి’తో పలు విష­యాలు పంచుకున్నా­రు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..  

‘వరంగల్‌లో రైలు ప్రమాదం తర్వాత ఒకేసారి మంటల్లో కాలిపోయి కుప్పగా, ముద్దగా మారిన మృతదేహాలను ఇప్పుడే చూస్తున్నా. ఘటన స్థలాన్ని చూడగానే అయ్యో పాపం.. ఏమిటీ దారుణం అని బాధపడ్డాను. కాలిన బస్సు ఎక్కి మృతదేహాలను పరిశీలించాను. బస్సు తగలబడుతున్నప్పుడు ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయాణికులు ఎంతగా ప్రయత్నించారో ఆ దృశ్యాలను చూస్తే అర్థమవుతుంది. ముందున్న తలుపు తెరుచుకోకపోవడంతో వెనుక వైపునకు వెళ్లేందుకు అందరూ ప్రయత్నించినట్లున్నారు.

ఇదే సమయంలో వారిని కార్బన్‌ డయాక్సైడ్, కార్బన్‌ మోనాక్సైడ్, హైడ్రో కార్బన్స్‌ వంటి విపరీతమైన విష వాయువులు కమ్మేసి ఉంటాయి. ఈ వాయువులు ఒకేసారి పీల్చడం వల్ల అందరూ ఎక్కడికక్కడ స్పృహ తప్పి పడిపోయి ఉంటారు. ఇలా బస్సు మధ్యలో కొందరు, చివరలో కొందరు కుప్పకూలిపోయినట్లు కనిపించారు. అదే సమయంలో వ్యాపించిన మంటలకు వారు ఆహుతై ఉంటారు. ఇలాంటి మంటలు నిమిషాల వ్యవధిలోనే మనిషిని ముద్దగా, బొగ్గుగా మార్చేస్తాయి. 

దాదాపుగా అన్ని మృతదేహాలకు శరీరంలో కేవలం తల, మొండెం మాత్రమే మిగిలాయి. పుర్రెలు కనిపిస్తున్నా వాటిని ముట్టుకుంటే రాలిపోతున్నాయి. బస్సులో ఇలాంటి దృశ్యాలను చూసి చలించిపోయాను. కొద్దిసేపటి తర్వాత తేరుకుని నా వృత్తి ధర్మాన్ని నెరవేర్చేందుకు ప్రణాళిక వేసుకున్నా. ఏయే ఏర్పాట్లు కావాలో.. అక్కడున్న అధికారులకు వివరించాను. ఇందుకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.సిరి, జిల్లా ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ సహకరించారు. 

తాత్కాలిక మార్చురీలో పోస్టుమార్టం 
పోస్టుమార్టం నిర్వహించేందుకు నాతో పాటు ఫోరెన్సిక్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ పి.బ్రహ్మాజీ మాస్టర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు డాక్టర్‌ కె.నాగార్జున, డాక్టర్‌ పి.హరీష్‌కుమార్, డాక్టర్‌ వి.సురేఖ, డాక్టర్‌ ఎండి. మహమ్మద్‌ సాహిల్‌తో పాటు 10 మంది పీజీలు కలిసి ఆరు బృందాలుగా ఏర్పడ్డాం. ఒక్కొక్కరు మూడు చొప్పున మృతదేహాల చొప్పున  పోస్టుమార్టం చేశాం. ప్రమాదం జరిగిన స్థలంలోనే తాత్కాలిక మార్చురీ గదిని ఏర్పాటు చేయించాం. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అక్కడ పోస్టుమార్టం నిర్వహించాం. 

మరికొన్ని మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదిలో పోస్టుమార్టం నిర్వహించడంతో పాటు డీఎన్‌ఏ పరీక్ష కోసం నమూనాలు తీశాం. మృతదేహాల్లో కండరాల టిష్యూ, దంతాలు, తొడ ఎముకలను నమూనాలుగా సేకరించాం. మిగిలిన మృతదేహాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి కాబట్టి ఏ మృతదేహం ఎవరిదో గుర్తించేందుకు డీఎన్‌ఏ పరీక్ష అనివార్యమైంది. 

కుటుంబ సభ్యుల డీఎన్‌ఏతో పోలచ్చి చూసి పోలీసుల సమక్షంలో మృతదేహాలను వారి రక్త సంబం«దీకులకు అప్పగిస్తాం. చాలా మంది శరీరాలు బొగ్గుగా, ముద్దగా, బూడిదగా మారినా, వారి శరీరాలపై ఆభరణాలు మాత్రం అలాగే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల మెడల్లో మంగళసూత్రాలు, చేతి గాజులు, చైన్లు వంటివి కాలకుండా కనిపించాయి. బంగారు ఆభరణాలు కరిగిపోవాలంటే ఇంకా ఎక్కువ వేడి అవసరం. 

Videos

ఫై దుబాయ్ ఘటనలో.. భయానక అనుభవాలు.. బయటపెట్టిన పైలట్ స్మిత్ మచ్చర్

తమన్నాతో బ్రేకప్.. మళ్లీ ఆమెతో డేటింగ్.!

అగ్నిగుండంగా పారిస్.. చారిత్రక భవనానికి నిప్పు

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)