Breaking News

‘సత్రం’ భూములు కొట్టేయడానికి టీడీపీ నేతల ఆత్రం

Published on Sat, 04/26/2025 - 04:40

సాక్షి, ప్రతినిధి, కాకినాడ: నాళంవారి సత్రం భూములను దొడ్డిదారిన కొట్టేసేందుకు టీడీపీ నేతలు కుట్రలు పన్నుతున్నారు. వేలం లేకుండా దక్కించుకోవాలని శతవిధాలా యత్నిస్తున్నారు. రాజమహేంద్రవరం నాళం వారి సత్రానికి గోదావరి జిల్లాల్లో మంచి పేరు ఉంది. దీనికి రెండు జిల్లాల్లోనూ వందల ఎకరాల మాగాణి భూములు ఉన్నాయి.  కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగి మండలం శృంగవృక్షంలో 268.64 ఎకరాల భూమి ఈ సత్రానికి ఉంది. ఈ భూములను వేలం నిర్వహించి మూడేళ్ల కాల పరిమితికి లీజుకు ఇస్తుంటారు. 

ప్రస్తుత లీజు కాలం ఈనెల 29తో ముగుస్తుంది. దీంతో ఈనెల 29న భూములకు వేలం నిర్వహించేందుకు సత్రం కార్యనిర్వహణాధికారి చందక దారబాబు కరపత్రాలు పంచిపెట్టారు. 10 ఎకరాలలోపు రూ.5 లక్షలు పూచీకత్తు, 10 ఎకరాలు దాటితే రూ.10 లక్షలు పూచీకత్తు చెల్లించాలని, హెచ్చుపాటదారు మొదటి సంవత్సరం లీజు సొమ్ము చెల్లించాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. 

విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, టీడీపీ నేత యనమల రామకృష్ణుడు వర్గీయులు వేలం లేకుండా భూములు దక్కించుకోవాలని కుట్రలు పన్నుతున్నారు. ఈఓ దారబాబుపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.  వేలం నిర్వహించడం కుదరదని, తాము చెప్పే వారికి భూములు కట్టబెట్టాలని దేవస్థానం అధికారులకు యనమల హుకుం జారీ చేశారని సమాచారం.

సారవంతమైన భూములు
రెండు పంటలు పండే సారవంతమైన భూములు కావడంతో వీటిపై టీడీపీ నేతల కన్ను పడింది. వాటిని ఏదో రకంగా దక్కించుకోవాలని పన్నాగం పన్నుతున్నారు. తమ పార్టీ సానుభూతిపరులైన అరడజను మంది రైతులకు వేలంతో సంబంధం లేకుండా భూముల లీజు హక్కులు రాసిచ్చేయాలని అధికారులపై యనమల ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల 29న బహిరంగ వేలం జరుగుతుందా లేదా అనే సందిగ్థత నెలకొంది.

ఒత్తిళ్లకు లొంగేది లేదు 
ఈ నెల 29న బహిరంగ వేలం నిర్వహిస్తాం. ఇందుకు సంబంధించి వేలం నోటీసులు గ్రామ పంచాయతీలో అతికించాం. కరపత్రాలు గ్రామంలో అందరికీ అందేటట్టు ఏర్పాటు చేశాం. ఎవరి ఒత్తిళ్లకు లొంగేది లేదు. గతం కంటే హెచ్చుపాట రాకపోతే మళ్లీ వేలం నిర్వహిస్తాం. పాట దక్కించుకున్న వ్యక్తి మొదటి ఏడాది లీజు మొత్తం జమ చేస్తేనే భూములు అప్పగిస్తాం.  – చందక దారబాబు, కార్యనిర్వహణాధికారి, నాళంవారి సత్రం, రాజమహేంద్రవరం 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)