Breaking News

మీ భర్తలు జగన్‌ పర్యటనకు వెళ్లారు..

Published on Sat, 06/21/2025 - 05:06

సత్తెనపల్లి: మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి పర్యటన విజయవంతం కావడంతో ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. సత్తెనపల్లి మండలం నందిగామ అడ్డరోడ్డు సమీపంలోని డంపింగ్‌ యార్డ్‌ కేంద్రంలో బీసీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వం మహిళలకు ఉచిత టైలరింగ్‌ శిక్షణ ఇస్తోంది. సత్తెనపల్లి మండలం లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన కనుమూరు వనజ, నర్రా మల్లేశ్వరి ఈ శిక్షణకు వెళుతున్నారు. అయితే గురువారం వైఎస్‌ జగన్‌ సత్తెనపల్లి పర్యటనలో వారి భర్తలు కనిపించారంటూ టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు.

దీంతో ఇకపై శిక్షణకు రావద్దు అంటూ నిర్వాహకులు నాగదుర్గ, ఈశ్వరి ఆదేశించారు. దీంతో వారు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. మల్లేశ్వరి కంటతడి పెట్టుకుని వెళ్లిపోగా, వనజ మాత్రం న్యాయ పోరాటానికి దిగింది. జరిగిన విషయాన్ని భర్త విశ్వేశ్వరరావుకు చెప్పి, శుక్రవారం సత్తెనపల్లి ఎంపీడీవో బండి శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేసింది. తాము ప్రారంభం నుంచి శిక్షణకు హాజరవుతున్నామని, ఏ ఉద్దేశంతో శిక్షణకు రావద్దని చెప్పారో తెలపాలని, న్యాయం చేయాలని కోరింది. బీసీ కార్పొరేషన్‌ జిల్లా అధికారులతో పాటు కలెక్టర్‌ను కూడా కలిసి సమస్య విన్నవించుకుంటానని, అసలు ఈ విషయంలో రాజకీయ పారీ్టల జోక్యం ఏంటని నిలదీసింది. న్యాయం జరిగే వరకూ పోరాడతానని స్పష్టం చేసింది.

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)