Breaking News

ఎన్నికలప్పుడు బాణసంచా పేలి గాయపడ్డానని ఇప్పుడు కేసు!

Published on Fri, 06/27/2025 - 05:10

రాయచోటి/లక్కిరెడ్డిపల్లె: అదిగో పులి అంటే.. ఇదుగో తోక అన్నట్లుంది కూటమి పాలనలో పోలీసుల వ్యవహార శైలి. గత సార్వత్రిక ఎన్నికలప్పుడు బాణసంచా కాల్చడంతో అప్పట్లో తాను గాయపడ్డానంటూ ఓ టీడీపీ నాయ­కుడు ఫిర్యాదు చేయడమే తరువాయి.. పోలీసులు కేసు కట్టడం విస్తుగొలుపుతోంది. అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం కుర్నూతుల అగ్రహారానికి చెందిన లోకేశ్‌ అనే యువకుడు 14 నెలల కిందట ఎన్నికల ప్రచారంలో వైఎస్సార్‌సీపీ నాయకులకు స్వాగతం పలుకుతూ బాణసంచా కాల్చా­డు. ఆ క్రమంలో కంటి వద్ద గాయమైంది. 

అతడి చికిత్స కోసం అప్పట్లో వైఎస్సార్‌సీపీ నేతలు రూ.3 లక్షలకు పైగా ఆర్థిక సాయం అందించారు. ఎన్నికల తర్వాత టీడీపీలో చేరిన లోకేశ్‌.. ఇప్పుడు టీడీపీ పెద్దల సూచనతో వైఎస్సా­ర్‌సీపీ నేతలను టార్గెట్‌ చేసుకుని తప్పుడు కేసులకు ఉపక్రమించాడు. ‘వారు బాణసంచా తెచ్చి కాల్చమని చెప్పారు. అది కాల్చినందువల్లే అప్పట్లో నా కంటికి గాయమైంది’ అంటూ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం విచారించాలని మానవ హక్కుల కమిషన్‌ లక్కిరెడ్డిపల్లె పోలీసులకు సూచించింది. 

ఇదే అవకాశంగా టీడీపీ నేతలు ఒత్తిడి చేయడంతో పోలీసులు కక్ష పూరితంగా 326, 420 సెక్షన్స్, ఎక్స్‌ప్లోజివ్స్‌ యాక్ట్‌ కింద మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, ఎంపీపీల సంఘం జిల్లా అధ్యక్షుడు, లక్కి­రెడ్డిపల్లె ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి సహా 19 మందిపై అక్రమ కేసు నమోదు చేశారు. ఎవరికీ నోటీసులు ఇవ్వకుండానే అరెస్టులకు ఉపక్రమించారు. గురువారం సాయంత్రం సుదర్శన్‌రెడ్డి­ని అరెస్ట్‌ చేశారు. మిగతా వారందరినీ అరెస్ట్‌ చేస్తామని చెబుతున్నారు. 

వాస్తవానికి ఆ ప్రమాద సమ­యంలో శ్రీకాంత్‌ రెడ్డి వేరే మండలంలో ప్రచారంలో ఉన్న­ప్పటికీ కేసు నమోదు చేయడం రెడ్‌బుక్‌ దుర్మార్గానికి పరా­కాష్ట. నిజానికి తనంతట తానే బాణ­సంచా కాల్చు­తూ.. ఆ క్రమంలో అప్పుడు గాయ­పడి, ఇప్పుడు ఫిర్యాదు చే­య­డం దారుణమని.. దీని­పై పోలీసులు నిజానిజాలు విచా­రించకుండానే తప్పుడు కేసులు పెట్టడం సరికాదని ప్రజలు మండిపడుతున్నారు. 

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)