Breaking News

సీఎం జగన్‌ చిత్రపటానికి రాజధాని ప్రాంత రైతు కూలీల క్షీరాభిషేకం

Published on Sat, 03/02/2024 - 02:18

మంగళగిరి : రాజధాని ప్రాంత రైతు కూలీలు సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. రైతు కూలీల పింఛన్‌ను సీఎం  జగన్‌ రూ.5 వేలకు పెంచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శుక్రవారం గుంటూరు జిల్లా యర్రబాలెం, నిడమ­ర్రులో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త గంజి చిరంజీవితో కలిసి పర్యటించి వలంటీర్ల ద్వారా రైతు కూలీలకు రూ.5 వేల చొప్పున పింఛన్‌లను పంపిణీ చేశారు. ఈ నేప­థ్యంలో యర్రబాలెంలో పలువురు లబ్ధిదా­రులు సీఎం వైఎస్‌ జగన్‌ చిత్రపటానికి, నిడమ­ర్రులో వైఎస్సార్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

ఎమ్మె­ల్యే ఆర్కే మాట్లాడుతూ కుల, మత, రాజకీ­యా­లకతీతంగా రైతు కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం పింఛన్లు అందిస్తోందని, అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన మాట ప్రకారం సీఎం జగన్‌ రూ.5 వేల పింఛన్‌ల పంపిణీకి శ్రీకారం చుట్టారని తెలిపారు. చంద్రబాబు రాజధాని ప్రాంతంలో తమ స్వార్థం కోసం, స్వలాభం కోసం రైతులను, రైతు కూలీ­లను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతు­లు లబ్ధిపొందలేకపోయారని, ఇక రైతు కూలీల జీవితాలైతే అగమ్యగోచరంగా తయా­రైన పరిస్థితు­లను చూశామన్నారు.

రాజధాని నిర్మా­ణం పేరుతో రైతుల భూములను తీసుకున్న చంద్రబాబు.. రాజధానిని నిర్మించలేకపోవడంతో పా­టు రైతులు, రైతు కూలీలకు న్యాయం చేయలే­కపో­యాడని విమర్శించారు.  ఇలాంటి పరిస్థితుల్లో అధి­కారం చేపట్టిన వైఎస్‌ జగన్‌ అసెంబ్లీ సాక్షిగా తాను రైతు కూలీలను ఆదుకుంటానని వాగ్దానం చేశారని, ఆ మేరకు రూ.2,500గా ఉన్న రైతు కూలీ­ల పింఛన్‌ను రూ.5 వేలకు పెంచారని ప్రశంసించారు.  

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)