Breaking News

‘రప్పా.. రప్పా’పై కేబినెట్‌లో చర్చ.. జాగ్రత్తగా మాట్లాడండి

Published on Wed, 06/25/2025 - 07:08

సాక్షి, అమరావతి: మంత్రివర్గ సమావేశంలో ‘రప్పా.. రప్పా’ డైలాగ్‌ రాజకీయంపై చర్చ జరిగినట్టు తెలిసింది. ఇటీవల వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సత్తెనపల్లి పర్యటనలో టీడీపీ కార్యకర్త రవితేజ ‘పుష్ప–2’ సినిమాలోని డైలాగ్‌ ‘రప్పా.. రప్పా’ అంటూ పోస్టర్‌ ప్రదర్శించిన విషయం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై వివాదం రాజేసిన చంద్రబాబు, టీడీపీ నేతలు చివరకు ఆ పోస్టర్‌ ప్రదర్శించిన రవితేజ టీడీపీ కార్యకర్త అని తేలడంతో కంగుతున్నారు.

దీంతో, ఈ విషయంలో కూటమికి నష్టం జరిగిందా? లాభం జరిగిందా? అనే దానిపై మాట్లాడుకున్నారు. కొందరు మంత్రులు చంద్రబాబు మెప్పు కోసం ఈ విషయంలో వైఎస్‌ జగన్‌కే నష్టం జరిగిందని, వారికి బాగా డ్యామేజ్‌ అయిందనే రీతిలో మాట్లాడినట్టు సమాచారం. భిన్నాభిప్రాయంతో ఉన్న మరికొందరు బయటకు వచ్చాక రియాలిటీగా మాట్లాడితే బాగుంటుందని అన్నట్టు తెలిసింది. అలాగే జగన్‌ పర్యటనలో ఆయన కారుకింద పడి కార్యకర్త మృతి చెందిన వ్యవహారంపై ఒక మంత్రి ప్రస్తావించగా.. చంద్రబాబు స్పందిస్తూ చట్టప్రకారం ఏం చేయాలో అది చేస్తామని తెలిపారు.  

పోలవరం–బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై మంత్రులు జాగ్రత్తగా మాట్లా­డా­లని చంద్రబాబు సూచించారు. సబ్జెక్టు తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడకూడదని, తెలంగాణకు జవాబిచ్చే రీతిలో ఉండాలని, అదే సమయంలో అక్కడి వారికి వ్యతిరేకంగానూ ఉండకూడదని చెప్పినట్టు సమాచారం. మిగులు జలాలను మాత్రమే వాడుకుంటున్నట్టు చెప్పాలని సూచించారు. కాగా, మంత్రివర్గ సమావేశం మొదలుకాగానే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌ వెళ్లిపోయారు. సమావేశానికి వచ్చి కూర్చు­న్న ఆయన తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని తెలియడంతో సీఎంకు చెప్పి  వెళ్లిపోయారు.   

Videos

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

రాజీనామానా..? బర్తరఫ్ నా..? క్లైమాక్స్ కు కొండా సురేఖ ఎపిసోడ్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)