Breaking News

‘తల్లికి వందనం’పై దద్దరిల్లిన మండలి

Published on Fri, 02/13/2026 - 05:39

సాక్షి, అమరావతి: సవాళ్లు ప్రతిసవాళ్లతో గురువారం శాసన మండలి దద్దరిల్లింది. గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో అధికార, విపక్ష పార్టీ సభ్యులు ఒకరికొకరు సవాళ్లు విసురుకున్నారు. గవర్నర్‌ చేత అవాస్తవాలు చెప్పించారంటూ వైఎస్సార్‌సీపీ సభ్యుడు పి.చంద్రశేఖర్‌రెడ్డి గణాంకాలతో వివరించారు. తల్లికి వందనం పథకం కింద మొదటి ఏడాది ఒక్క రూపాయి పడలేదని, రెండో ఏడాది పూర్తిగా రూ.15 వేలు ఇవ్వకుండా తగ్గించి ఇచ్చి, గవర్నర్‌ చేత మాత్రం పూర్తిగా ఇచ్చేసినట్లు అవాస్తవాలు చెప్పించారని ఎత్తి చూపారు. 

అన్నదాత సుఖీభవ కింద ఏ రైతు ఖాతాలో రూ.20,000 జమ చేయకుండానే ఇచ్చేసినట్లు అసత్యాలు వల్లె వేయించారని విమర్శించారు. దీనిపై మంత్రి కొలుసు పార్థసారధి స్పందిస్తూ.. గవర్నర్‌ ప్రసంగంలోని ప్రతీ మాటకు కట్టుబడి ఉన్నామని, అర్ధ సత్యాలతో సభను తప్పుదోవ పట్టించొద్దంటూ అడ్డు తగలడంతో సభ ఒక్కసారిగా వేడెక్కింది. మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎవరివి అవాస్తవాలో.. ఎవరివి నిజాలో ప్రజలు తెలుసుకుంటారన్నారు. 

ఇప్పటికీ చాలా కుటుంబాలకు తల్లికి వందనం కింద పూర్తి స్థాయిలో డబ్బులు పడలేదని, ఈ మాటకు తానూ కట్టుబడి ఉన్నానని చెప్పారు. ఇది తప్పు అని నిరూపిస్తే క్షమాపణ చెప్పి తన మాటలు వెనక్కి తీసుకుంటానని సవాల్‌ విసిరారు. కావాలంటే మీ నియోజకవర్గ అధికారులను అడిగి తెలుసుకోవాలన్నారు. దీనిపై మంత్రి పార్థసారధి స్పందిస్తూ.. సాంకేతిక కారణాలతో ఒకరిద్దరికి పడకపోవచ్చని, వీటిని తమ దృష్టికి తీసుకువస్తే సరి చేస్తామన్నారు. 

దమ్ముంటే తప్పు అని నిరూపించండి
ఒకరిద్దరు కాదు.. 15–18 శాతం మందికి ఇంకా రూ.7 వేల నుంచి రూ.8 వేలు చెల్లించాల్సి ఉందనే మాటకు ఇప్పటికీ తాను కట్టుబడి ఉన్నానని బొత్స ప్రతి సవాల్‌ విసరడంతో అధికార పక్షం ఆత్మరక్షణలో పడింది. ఆధారాలిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమని, అన్నదాత సుఖీభవ కూడా పడలేదంటూ తప్పుడు సమాచారం చెపుతున్నారని మంత్రి పార్థసారథి చర్చను పక్కదోవ పట్టించే యత్నం చేశారు. ఇది పెద్దల సభ అని, తాము తప్పుడు సమాచారంతో సభను తప్పుదోవ పట్టించామని నిరూపిస్తే బేషరతుగా క్షమాపణ చెపుతానంటూ బొత్స మరోసారి స్పష్టం చేశారు. 

తిరిగి చర్చను ప్రారంభించిన చంద్రశేఖర రెడ్డి.. ఒక గ్రామంలోని సచివాలయంలో 21 మందికి తల్లికి వందనం అందలేదని ఫిర్యాదులు చేస్తే, వాటిని పరిశీలించి పరిష్కరించామంటూ చూపిస్తున్నా, ఇప్పటికీ తమ ఖాతాల్లో డబ్బులు పడలేదని లబ్ధిదారులు చెపుతున్నారంటూ ఆధారాలను సభకు సమర్పించారు. దీనిపై రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ కలుగచేసుకుంటూ.. అధికారుల తప్పు ఉంటే తప్పకుండా వారిని సస్పెండ్‌ చేస్తామన్నారు. ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌పై ప్రజల్లో భయాందోళనలు సృష్టించి, రద్దు చేసినట్లు ప్రకటించి.. వేరే పేరుతో దాన్నే కొనసాగిస్తున్నారని చంద్రశేఖరరెడ్డి తప్పు పట్టారు. 

‘గ్రామ, వార్డు సచివాలయాల పేర్లు మార్చి ఇప్పుడు ఇంటి వద్దకే పౌర సేవలు అంటున్నారు. చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా ఉండి కొత్తగా రెండు జిల్లాలు తీసుకువచ్చారు. తొలిసారి ముఖ్యమంత్రి అయిన జగన్‌ ఏకంగా ఒకేసారి కొత్తగా 13 జిల్లాలు తీసుకొచ్చారు. తద్వారా ఎవరు విజన్‌ ఉన్న ముఖ్యమంత్రో ఇట్టే తెలుస్తోంది’ అని చంద్రశేఖర రెడ్డి అన్నారు.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)