Breaking News

‘అసైన్డ్‌’ రిజిస్ట్రేషన్ల నిలిపివేత

Published on Sun, 08/11/2024 - 06:27

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం పేదలకు అసైన్డ్‌ భూములపై కల్పించిన యాజమాన్య హక్కులను హరించేలా కూటమి సర్కారు చర్యలకు దిగింది. యా­­జమాన్య హక్కులు కల్పించడం ద్వారా గత ప్రభు­త్వం 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించిన భూములపై విచారణ నిర్వహించాలని కలెక్టర్ల­ను ఆదేశించింది. యా­జ­మాన్య హక్కులు పొందిన తర్వాత రిజి­్రస్టేషన్లు జర­గని లేదా ఎలాంటి లావాదేవీలు జర­గని భూముల రిజిస్ట్రేషన్లను నిలుపుదల చేయా­లంది. ఇప్పటికే రిజిస్ట్రేషన్లు జరిగిన భూములపై పూర్తి స్థాయి విచారణ జరపాలని పేర్కొంది.

ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసో­డియా శనివారం కలెక్టర్లు, రిజి్రస్టార్లు, సబ్‌ రిజిస్ట్రార్లకు సర్క్యులర్‌ జారీ చేశారు. అసైన్డ్‌ భూములకు యాజ­మాన్య హక్కుల వల్ల అనర్హులు లబ్ధి  పొందారని, రిజిస్ట్రేషన్ల చట్టం 1908 సెక్షన్‌ 22ఏకి విరు­ద్ధంగా హక్కులిచ్చారని అందులో పేర్కొన్నారు. సామాజిక, పోరంబోకు భూములపై అక్రమంగా హక్కులిచ్చారని, అనంతరం వాటిని 22ఏ జాబితా నుంచి తొలగించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నట్లు ఫిర్యాదులు వచ్చా­యని సర్క్యులర్‌లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అసైన్డ్‌ భూముల­కు యాజమాన్య హక్కులిచి్చన చోట్ల విచారణ నిర్వ­హించి దీనిద్వారా ఎక్కడైనా భూకబ్జా­లు జరిగాయా? హక్కుల నిర్థారణలో వాస్తవికత ఉందో లేదో నిర్థారించేందుకు వెరిఫికేషన్‌ చేయాలని ఆదేశించారు.

మూడు నెలలో వెరిఫికేషన్‌ పూర్తి కావాలని, ఇందుకోసం కలెక్టర్లు విచారణ సంస్థలను ఉపయో­గించుకోవాలని సూచించారు. విచారణ సందర్భంగా ఏ కేసులోనైనా యాజమాన్య హక్కుల కల్పన అక్రమంగా జరిగినట్లు తేలితే వాటిని రద్దు చేసి ఆ భూమి­ని తిరిగి 22ఏ నిషేధిత జాబితాలో చేర్చేలా రీ క్లాసిఫికేషన్‌ చేయాలని ఆదేశించారు. యాజమాన్య హక్కు­లిచి్చన భూములను ఇంకా రిజిస్టర్‌ చేసుకోకపోతే ఇకపై వాటికి రిజిస్ట్రేషన్లు చేయ­వద్దని సూచించారు. విచారణలో యాజమాన్య హక్కులు సక్రమంగానే ఇచి్చనట్లు తేలినా వాటిపై రిజిస్ట్రేషన్లకు అనుమతించవద్దని స్పష్టం చేశారు. కోర్టు కేసుల్లో ఉన్న భూముల­కు సంబంధించి ఈ ఆదేశాలు వర్తించవని తెలిపారు.

Videos

మీకో దండం... మీ మీద నమ్మకం లేదు స్వామి సెక్యూరిటీ అని చెప్పి మమ్మల్ని...

వైరల్ అవుతున్న ప్రభాస్ చెల్లెల లేటెస్ట్ ఫోటోలు..

చెవిరెడ్డి పోరాటం.. నామినేషన్లు సక్సెస్

ఏపీ స్థానిక ఎన్నికలపై సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు

విజయవాడలో YSRCP ఎన్నికల ప్రచార హోరు

కడప ZP ఆఫీస్ లో నామినేషన్ల స్క్రూటినీ.. వీడియో వైరల్

మహిళలపై TDP మూకలు ఎలా దాడి చేశారో చూడండి

చింతమనేని మోసం చేశాడు.. వాపోయిన జనసేన దెందులూరు ఇంచార్జ్ వెంకటలక్ష్మి

ప్రచారంలో దూసుకుపోతున్న YSRCP వరుదు కళ్యాణి

మార్కెట్లో జియో మెగా సునామీ.. అప్లై చేసిన వారికి షేర్లు దక్కుతాయా?

Photos

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్